ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో రహదారులన్నీ జలమయం అయ్యాయి. మోకాలు లోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్థిక రాజధాని ముంబైను కుండపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరం అతలాకుతలం అయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వృక్షాలు కూలిపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
ముంబైలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షాలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. అంధేరీలో మ్యాన్‌హోల్‌లో పడి ఓ మహిళ మృతి చెందింది. ఆ మహిళను 45 ఏళ్ల విమల్ గైక్వాడ్‌గా గుర్తించారు.
ఆర్థిక రాజధాని ముంబైను కుండపోత వర్షం ముంచెత్తింది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో నగరం అతలాకుతలం అయిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో అత్యంత భారీ వర్షం కురవడంతో జనాలకు చుక్కలు కనిపించాయి.
ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనదారులు కూడా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. స్పైస్‌జెట్ మరియు విస్తారా కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు ఎక్స్‌లో పేర్కొన్నాయి.
ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. రైల్వే స్టేషన్ల, ఎయిర్‌పోర్టుల్లో నీళ్లు నిలిచిపోయాయి. దీంతో ఇప్పటికే రైళ్లు, 50 విమానాలు రద్దు చేశారు. అలాగే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సోమవారం తెల్లవారుజామున ముంబై.. శివారు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. దీంతో.. రోడ్లు, లోతట్టు ప్రాంతాలపై భారీగా నీరు నిలిచింది. భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు.. భారీ వర్షం దృష్ట్యా కొన్ని రైలు సర్వీసులను రద్దు చేయగా, ముంబై విమానాశ్రయంలో 27 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. నగరంలో తెల్లవారుజామున 1 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు శాఖ అధికారులు తెలిపారు.