Urinating Incident on Flight: విమానంలో ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన నెల తర్వాత వృద్ధురాలు ఫిర్యాదు చేయడం, ముంబైకి చెందిన శంకర్ మిశ్రా పరారీలో ఉండటం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ తరుణంలో న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ముంబై నివాసి శంకర్ మిశ్రాను ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
మద్యం మత్తులో సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన మిశ్రాను బెంగళూరు నుంచి అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది. నిందితుడి కోసం ఢిల్లీ పోలీసులు గురువారం లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ) జారీ చేశారు. ఎయిర్ ఇండియా ఫిర్యాదు మేరకు గతేడాది నవంబర్ 26న జరిగిన షాకింగ్ ఘటనపై ఢిల్లీ పోలీసులు బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354, 509, 510, ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ సెక్షన్ 23 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎయిర్ ఇండియా కూడా ప్రయాణికుడిపై 30 రోజుల విమాన నిషేధాన్ని విధించింది.కాగా, మూత్ర విసర్జన ఘటనలో ఎయిర్ ఇండియా విమానం పైలట్ సహా ఆరుగురు ఎనిమిది మంది సిబ్బందికి ఢిల్లీ పోలీసులు శుక్రవారం సమన్లు జారీ చేశారు. అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గో తన ఉద్యోగి శంకర్ మిశ్రాను శుక్రవారం తొలగించింది. వెల్స్ ఫార్గో ఉద్యోగులకు వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రవర్తనలో అత్యున్నత ప్రమాణాలను కలిగి ఉందని.. ఈ వ్యక్తిని వెల్స్ ఫార్గో నుండి తొలగించామని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. నిందితుడు మిశ్రాపై దర్యాప్తుకు సహకరించేందుకు ఢిల్లీ పోలీసులు వెల్స్ ఫార్గోకు చేరుకున్న తర్వాత కంపెనీ ప్రకటన వెలువడింది.
Boy Shoots Teacher: టీచర్‌ను తుపాకీతో కాల్చిన ఆరేళ్ల బుడ్డోడు.. అందుకేనా?
ఇదొక్కటే కాదు.. స్వల్ఫ వ్యవధిలో ఇలాంటి వికృత ఘటనలు చోటు చేసుకోవడంతో డీజీసీఏ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో అలాంటి ప్రయాణికుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని, ఇకపై కఠినంగానే వ్యవహరించాలని విమానయాన నియంత్రణ సంస్థ నిర్ణయించుకుంది. విమానాల్లో ఇష్టానుసారం, పద్ధతి లేకుండా ప్రవర్తించే ప్రయాణికులను నిలువరించాల్సిన బాధ్యత పూర్తిగా సిబ్బందిదేనని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్‌లైన్స్ సంస్థలతో పేర్కొంది.