ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతోంది. అయితే.. ఐపీఎల్-2023 సీజన్‌లో జరుగుతున్న 31వ మ్యాచ్ ఇది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంటే, పంజాబ్ జట్టు ఏడో స్థానంలో ఉంది. ఇరు జట్లకూ ఆరేసి పాయింట్లు ఉన్నాయి. రన్ రేట్ ముంబైకి ఎక్కువగా ఉంది. అయితే.. టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ తీసుకున్నాడు. హ్యాట్రిక్ విజయాలతో ముంబై జోరు మీదుంది. మరో వైపు పంజాబ్ ఓటమితో ఉంది. ఆఖరి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళురు చేతిలో కంగుతిన్న పంజాబ్ గెలుపుపై కన్నేసింది. దీంతో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ పెరిగింది.
Also Read : Afghanistan: ఆఫ్గాన్‌లో ఈద్ వేడుకలు.. మహిళలపై తాలిబన్ల ఆంక్షలు
అయితే ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. అంతకముందు 11 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్ గ్రీన్ బౌలింగ్‌లో చావ్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అలాగే.. 8వ ఓవర్లో అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ప్రబ్‌సిమ్రన్ సింగ్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది పంజాబ్. 10వ ఓవర్‌ను చావ్లా వేశాడు. రెండో బంతిని వైడ్‌గా వేయగా తప్పుగా అంచనా వేసిన లివింగ్ స్టోన్(10) ముందుకు వచ్చి షాట్ ఆడేందుకు యత్నించి స్టంపౌట్ కాగా… నాలుగో బంతికి అథర్వ తైడే(29) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో సామ్ కర్రాన్(0), హర్ ప్రీత్ సింగ్ భాటియా(1) ఉన్నారు.
Also Read : Etela Rajendar: భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా రేవంత్ ప్రమాణం.. ఈటల రియాక్షన్ ఇదే..