Mumbai Encounter Specialist Daya Nayak: ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ దయా నాయక్ పదవీ విరమణకు 48 గంటల ముందు ఆ శాఖ పదోన్నతి కల్పించింది. మహారాష్ట్ర పోలీస్‌లో ప్రసిద్ధి చెందిన దయా నాయక్ ఇప్పుడు ఏసీపీ (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్)గా పదోన్నతి పొందారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. మంగళవారం పదోన్నతి పొందిన దయా నాయక్ గురువారం పదవీ విరమణ చేయనున్నారు. ముంబై పోలీసులు మహారాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ పరిధిలోకి వస్తారు. దయా నాయక్ కు హోం శాఖ పదోన్నతి కల్పించింది. దయా నాయక్ తో పాటు, ముంబై పోలీసులకు చెందిన మరో ముగ్గురు సీనియర్ ఇన్స్పెక్టర్లకు పదోన్నతి కల్పించారు. వారి పేర్లు జీవన్ ఖరత్, దీపక్ దల్వి, పాండురంగ్ పవార్.
READ MORE: ENG vs IND 5th Test: నలుగురు స్టార్స్ అవుట్.. ఇంగ్లండ్ తుది జట్టు ఇదే!
దయా నాయక్ 1995లో ముంబై పోలీస్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన బాంద్రా క్రైమ్ బ్రాంచ్ యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ముంబై పోలీస్‌లో ఆయన తొలి పోస్టింగ్ జుహు పోలీస్ స్టేషన్‌లో కొనసాగింది. 90స్‌లో ముంబై పరిస్థితి వేరేలా ఉండేది. 1993లో ముంబై పేలుళ్లతో ముంబై మాత్రమే కాదు, మొత్తం భారతదేశం కుదేలైంది. ముంబైలో అండర్ వరల్డ్ ప్రభావం పోలీసులకు తీవ్రమైన సవాలుగా మారింది. ఈ ముఠాల ఘర్షణలు సర్వసాధారణంగా మారాయి. దోపిడీ, బెదిరింపులు, హత్యల కారణంగా నగర వాతావరణం అల్లకల్లోళంగా మారింది. ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చాడు దయా నాయక్. ముంబై పోలీస్ శాఖలో చేరాడు. నేరస్థులతో ఘర్షణకు దిగాడు. 1996లో దక్షిణ ముంబైలో చోటా రాజన్ ముఠాకు చెందిన ఇద్దరు అనుచరులైన వినోద్ మట్కర్, రఫీక్‌లను లేపేశాడు. దీనిపై మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. అతని ధైర్యం, చురుకుదనంపై పోలీసు వర్గాలలోనే కాకుండా అండర్ వరల్డ్‌లో కూడా చర్చించారు. 1997లో, దయా అంధేరీలో జరిగిన మరో హై ప్రొఫైల్ ఎన్‌కౌంటర్‌లో చోటా రాజన్ సన్నిహితుడు సతీష్ రౌత్‌ను చంపేశాడు. ఈ ఆపరేషన్‌తో పోలీసు శాఖలో అతని విశ్వసనీయతను పెంచింది.
READ MORE: Perni Nani: కొడుకు కోసమే చంద్రబాబు తపన.. జగన్ అడ్డంకి లేకుండా చేస్తున్నారు!
1998 నాటికి దయా నాయక్ ముంబై పోలీసులలో సుపరిచితుడుగా మారాడు. చాలా మంది పెద్ద, చిన్న నేరస్థులను లక్ష్యంగా చేసుకున్నాడు. వారిలో దావూద్ ఇబ్రహీం ముఠాలోని కొంతమంది అనుచరులు ఉన్నారు. అతని తెలివితేటలు, ఇన్ఫార్మర్ల నెట్‌వర్క్, ఖచ్చితమైన ప్రణాళికలు చాలా మంది నేరస్థులను ఎదుర్కోవడంలో సహాయపడ్డాయి. 1990ల చివరి నాటికి, దయా నాయక్ పేరు అండర్ వరల్డ్‌లో భయానికి పర్యాయపదంగా మారింది. దయా నాయక్ కెరీర్ పై “అబ్ తక్ చప్పన్” అనే బాలీవుడ్ చిత్రం కూడా వచ్చింది. అందులో నానా పటేకర్ దయా నాయక్ పాత్రను పోషించారు. కానీ ఒక నివేదిక ప్రకారం.. దయా నాయక్ 84 ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నట్లు చెబుతున్నారు. 2000లలో కూడా, దయా నాయక్ ముంబై పోలీసుల అనేక కార్యకలాపాలలో ముఖ్యమైన పాత్ర పోషించారు.
READ MORE: Perni Nani: కొడుకు కోసమే చంద్రబాబు తపన.. జగన్ అడ్డంకి లేకుండా చేస్తున్నారు!
2006లో అవినీతి నిరోధక బ్యూరో (ACB) దయా నాయక్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపించింది. దయా నాయక్ తన తల్లి రాధా నాయక్ పేరు మీద తన స్వగ్రామమైన యెన్‌హోల్‌లో ఒక హైటెక్ పాఠశాలను నిర్మించాడని ఒక మరాఠీ వార్తాపత్రిక నివేదించింది. అమితాబ్ బచ్చన్, సునీల్ శెట్టి వంటి తారలు దాని ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ ప్రాజెక్టు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని ఆరోపణలు వచ్చాయి. సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న తలెత్తింది. దీంతో దయా జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. కానీ ఏసీబీ అతనిపై చార్జిషీట్ దాఖలు చేయలేకపోయింది. బెయిల్ లభించడంతో బయటకు వచ్చారు. తరువాత జరిగిన దర్యాప్తులో నాయక్ పై ఎలాంటి మోసం చేయలేదని తేలింది. చివరికి అతను నిర్దోషిగా విడుదలయ్యారు. అనంతరం విధుల్లోకి చేరిన దయా నాయక్ మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS)లో కూడా పనిచేశారు. 2021లో అంబానీ నివాసంలో జరిగిన భద్రతా ఉల్లంఘన కేసును దర్యాప్తు చేసిన బృందంలో ఒకరు. దయా నాయక్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరపడం, ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య, నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి వంటి ప్రముఖ కేసులను ఛేధించారు.