Mudragada Padmanabham: ముద్రగడను అక్కడి నుంచి బరిలోకి దింపాలి..! జనసేనకు టీడీపీ ప్రతిపాదనలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Padmanabham: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.. ఇదే సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని తేల్చేశారు. అయతే, ఎన్నికల పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ-జనసేన.. సీట్ల పంపకాలపై దృష్టి సారించాయి.. రెండు పార్టీల అధినేతలు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, ముద్రగడ పద్మనాభం ఇంకా జనసేనలో చేరకముందే.. ఆయనను ఏ స్థానం నుంచి బరిలోకి దింపాలనే ఆలోచన ఇరు పార్టీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. కాకినాడ సిటీ నుంచి ముద్రగడను పోటీ చేయించాలని జనసేనకి సూచించాలని కాకినాడ జిల్లా టీడీపీ నేతలు ఆలోచనలో ఉన్నారట.
Also Read
- 6 ఏళ్ల తర్వాత 'S' సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
కాకినాడ నుంచి వైసీపీ నుంచి బరిలోకి దిగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించాలంటే ముద్రగడ పద్మనాభమే సరైన ప్రత్యర్థి అని జిల్లా టీడీపీ నేతల అభిప్రాయంగా ఉందని తెలుస్తోంది. నియోజకవర్గంలో కాపు, ఫిషర్మెన్ ఓట్లు అధికంగా ఉన్నరాయి.. ప్రస్తుతం మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వనమాడి కొండబాబు టీడీపీ కో-ఆర్డినేటర్‌గా ఉన్నారు. మరోవైపు.. ముద్రగడ, ద్వారంపూడి కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి.. ఈ ప్రతిపాదను ముద్రగడ ముందు పెడితే ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు.. త్వరలోనే కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లలనున్నారు.. ముద్రగడను జనసేన పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అయితే, పవన్ కల్యాణ్ వచ్చినప్పుడే.. టీడీపీ-జనసేన కూటమి తరుపున కాకినాడ సిటీ నుంచి ముద్రగడ పోటీ చేసే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి