ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ దాదాపు సగం మ్యాచులు పూర్తి చేసుకోబోతోంది. సీజన్ ఆద్యాంతం బ్యాటర్లదే పైచెయ్యి కనబడుతోంది. ప్రతి టీంలోని బ్యాట్స్మెన్స్ పరుగులు రాబట్టడంలో సఫలీకృతం అవుతున్నారు. ముఖ్యంగా భారతదేశ యువ క్రికెటర్లు మరోసారి రాణిస్తూ అంచనాలకు మించి పరుగులను రాబడుతున్నారు. ఇది ఇలా ఉండగా.. వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తలపడిన సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ తర్వాత ఎంఎస్ ధోని ఓ యువ అభిమానికి క్రికెట్ బంతిని బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Beer Sales: ఏం తాగార్రా నాయనా.. 18 రోజులు 23 లక్షల కేసుల బీర్లు..
మహేంద్ర సింగ్ ధోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ముంబై ఇండియన్స్ పై కేవలం నాలుగు బంతుల్లో 20 పరుగులు సాధించి చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ స్కోరును అందించాడు. అయితే ఆ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల విజయం సాధించింది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మహేంద్ర సింగ్ ధోని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తున్న సమయంలో అతడికి ఓ యువ అభిమాని కంటపడింది. మెహర్ అనే అమ్మాయి మహేంద్ర సింగ్ ధోని నుండి ఓ బంతిని బహుమతిగా పొందింది. ఇకపోతే., తాజాగా ఆ అమ్మాయి ఆ మధురమైన క్షణాన్ని గుర్తు చేసుకుంటూ స్టార్ స్పోర్ట్స్ తీసుకున్న ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి మాట్లాడింది.
Also Read: Delhi Excise Scam: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
ఇక ఆ అమ్మాయి మాట్లాడుతూ.. తాను అదృష్టవంతురాలని.. ధోని అంకుల్ నుండి బంతి అందుకున్న నేను ఫ్యూచర్లో కచ్చితంగా క్రికెటర్ ని అవుతానని తెలిపింది. ఫ్యూచర్ లో కచ్చితంగా తాను టీమిండియాకు ఆడేటప్పుడు ఆ బంతిని మరొక అభిమానికి అందించాలన్నది నా కల.. అంటూ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి తండ్రి కూడా ఉన్నారు. ఇక ఆ అమ్మాయి ఇచ్చిన ఇంటర్వ్యూకి క్రికెట్ ఫ్యాన్స్ ముగ్ధులు అయిపోయారు. ధోని చేసిన చిన్న పనికి ఆ అమ్మాయి ఆలోచన పూర్తిగా మారిపోయి.. ముందు ముందు దేశానికి ఆడాలని గొప్ప ఆలోచన ఆ అమ్మాయికి రావడం నిజంగా ఆశ్చర్యకరం.
That sweet moment when MSD paused for a young fan & gave her the ball| #IPLonStar🏏
In #IPLFanWeekOnStar, hear from little Meher, who lived the dream of many @msdhoni fans & aspires to represent India in cricket 😍
All eyes are on the 'Thala' who is all set to roar again with… pic.twitter.com/7D1cDcuhcl
— Star Sports (@StarSportsIndia) April 19, 2024