MS Dhoni Retirement: టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే ఆటగాడు ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2026 సీజన్ ధోనీకి చివరి సీజన్ అవుతుందని తెలిపారు.
MS Dhoni Jokes About Knee Pain When Asked on IPL 2026 Plans: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఐదేళ్లు అయింది. అయినా కూడా మహీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఐపీఎల్‌లో కేవలం రెండు నెలలు మాత్రమే ఆడే ధోనీ కోసం ఫాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తారు. అయితే గత రెండు సంవత్సరాలుగా…
MS Dhoni on IPL Future: ఐపీఎల్ ముగియడం.. వచ్చే సీజన్‌లో ఎంఎస్ ధోనీ ఆడతాడా? లేదా? అనే చర్చ జరగడం సహజమే. 2020 నుంచే ఇదే జరుగుతోంది. ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత కూడా మహీ ఆడటంపై చర్చ జరిగింది. ఇప్పటికీ ధోనీ ఏ కార్యక్రమానికి హాజరైనా ఇదే ప్రశ్న ఎదురవుతోంది. తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మహీ పాల్గొనగా.. వచ్చే సీజన్‌లో ఆడుతారా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు చెన్నై సూపర్ కింగ్స్…
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ గురించి ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ధోనీ రిటైర్మెంట్ ఇస్తున్నాడని, ఐపీఎల్‌లో నేడు చివరి మ్యాచ్ ఆడుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్‌పై మహీ స్వయంగా స్పందించాడు. తనకు నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 4-5 నెలల సమయం ఉందని, ఇప్పుడే తొందరేమీ లేదని తెలిపాడు. తాను రిటైర్మెంట్ ఇస్తానని చెప్పడం…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని రెండు రోజుల క్రితం వార్తలొచ్చిన విషయం తెలిసిందే. శనివారం చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకి దేవిలు వీక్షించడమే ఇందుకు కారణం. సాధారణంగా మహీ తల్లిదండ్రులు మ్యాచ్‌లు చూసేందుకు రారు. కానీ ఢిల్లీ మ్యాచ్‌కు రావడంతో ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే మ్యాచ్…
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకి దేవిలు శనివారం చెపాక్‌లో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను వీక్షించారు. మహీ 2008 నుంచి చెన్నై ప్రాంచైజీ తరఫున ఆడుతుండగా.. అతడి తల్లిదండ్రులు మాత్రం మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడం ఇదే తొలిసారి. ధోనీ తల్లిదండ్రులు మ్యాచ్‌కు హాజరైన నేపథ్యంలో మహీ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు మరోసారి మొదలయ్యాయి. ‘ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్…
MS Dhoni about IPL Retirement: మానసికంగా ప్రభావం చూపించే సామాజిక మాధ్యమాలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా అని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు చెప్పాడు. క్రికెటర్‌గా కొనసాగాలంటే కఠోర సాధన, ఫిట్‌గా ఉండడమే కీలకమని.. వయసుకు ఎవరూ మినహాయింపు ఇవ్వరని మహీ తెలిపాడు. ఐపీఎల్ 2024లో గాయం వెంటాడుతున్నా ధోనీ మైదానంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో…
MS Dhoni Retirement: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసిన విషయం తెలిసిందే. ఇటీవల బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓడి.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. దీంతో చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. బెంగళూరుతో జరిగిన మ్యాచే చివరిదని, ధోనీని మళ్లీ మైదానంలో చూడలేమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ వార్త బయటికొచ్చింది. తొడ కండర గాయంతో బాధపడుతున్న ధోనీ.. శస్త్రచికిత్స కోసం…
Chennai Super Kings Star MS Dhoni IPL Retirement: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనీ అభిమానులకు హార్ట్ బ్రేక్ న్యూస్. ఐపీఎల్ 17వ సీజన్ అనంతరం ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై చెబుతాడని సమాచారం. చెపాక్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ అనంతరం మహీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఐపీఎల్ 2024లో చెన్నై ప్లేఆఫ్‌కు అర్హత సాధించకపోతే.. చెన్నైలో ధోనీ ఆడే చివరి…
Ruturaj Gaikwad is CSK Captain after MS Dhoni Retirement: ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మహీ ఐపీఎల్‌కు సైతం రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ధోనీ తన నిర్ణయాన్ని సీఎస్‌కే మేనేజ్మెంట్‌కు ఇప్పటికే వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇకపై సీఎస్‌కే మెంటార్‌గా అతడు బాధ్యతలు చేపట్టనున్నాడట. తాజాగా సోషల్ మీడియాలో ధోనీ చేసిన పోస్టు ఈ వార్తలకు మరింత బలం…