Velammal Cricket Stadium: అంతర్జాతీయ ప్రమాణాలతో మదురైలో క్రికెట్ స్టేడియంను ప్రారంభించిన ధోని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Velammal Cricket Stadium: తమిళనాడులో రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా వేలమ్మాళ్ క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించారు మహేందర్ సింగ్ ధోని. ముంబై నుంచి ఓ ప్రైవేట్ విమానంలో మధురై చేరుకున్న ధోనిని చూసేందుకు అభిమానులు తెల్లవారుజాము నుంచే విమానాశ్రయం వద్ద భారీగా గుమిగూడారు. వేలమ్మాళ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) సహకారంతో నిర్మించిన ఈ అంతర్జాతీయ స్థాయి స్టేడియం కోసం రూ. 300 కోట్లకు పైగా ఖర్చు చేశారు. 12.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టేడియం, ప్రాంతీయ క్రికెట్ కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం దీని సీటింగ్ సామర్థ్యం 7,300 కాగా, భవిష్యత్తులో దీనిని 20,000కు పెంచే ప్రణాళికలు ఉన్నాయి.
SS Rajamouli: నేడు దర్శకధీరుడు రాజమౌళి పుట్టిన రోజు.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
Also Read
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
ఇక స్టేడియం ప్రత్యేకతల విషయానికి వస్తే.. ప్రపంచ స్థాయి క్రికెట్ మైదానంలో ఉండాల్సిన సౌకర్యాలను పొందుపరిచారు. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పిచ్, LED ఫ్లడ్‌లైట్లు, ఆధునిక ప్లేయర్ డ్రెస్సింగ్ రూమ్‌లు, డిజిటల్ స్కోర్‌బోర్డు, ప్రాక్టీస్ నెట్లు, జిమ్నాసియం, మీడియా, VIP గ్యాలరీలు ఇలా అన్నిటిని పొందుపరిచారు. ఇక విమానాశ్రయంలో దిగిన తర్వాత, ధోని తన ఐకానిక్ జెర్సీ నంబర్ ‘7’ ఉన్న తెల్లటి కారులో స్టేడియంకు చేరుకున్నారు. భారీ జన సందోహాన్ని నియంత్రించడానికి పెద్దెత్తున పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం తర్వాత గ్రౌండ్ లో కొద్దిసేపు బ్యాటింగ్ చేసి అభిమానులను అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ తర్వాత ధోని మళ్లీ ‘7’ నంబర్ ఉన్న నీలిరంగు కారులో విమానాశ్రయానికి వెళ్లి, ప్రైవేట్ చార్టర్లో ముంబైకి తిరిగి వెళ్లారు.
Weather Updates: తెలుగు రాష్ట్రాలకు వాన గండం.. భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
ఇటీవలే ధోని తన డ్రోన్ పైలట్ శిక్షణను పూర్తి చేసి కొత్త ఘనతను సాధించారు. భారతదేశంలో ప్రముఖ డ్రోన్ తయారీదారు, DGCA ఆమోదించిన రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (RPTO) అయిన గరుడ ఏరోస్పేస్ (చెన్నై) నుండి ఆయన ఈ శిక్షణ పొందారు. ధోని ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆ కఠినమైన శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత, ధోని ఇప్పుడు డ్రోన్లను నడపడానికి సర్టిఫికేషన్ పొందారు. తరగతులు, ప్రాక్టికల్ ఫ్లయింగ్ సెషన్లతో కూడిన ఈ శిక్షణ దేశంలో సురక్షితమైన డ్రోన్ ఆపరేషన్లను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Dhoni Batting at New Stadium in Madurai 💛🔥 pic.twitter.com/bRIsOdBo7M
— Ayyappan (@Ayyappan_1504) October 9, 2025
తాజావార్తలు
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
-
Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్… హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!