Velammal Cricket Stadium: తమిళనాడులో రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా వేలమ్మాళ్ క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించారు మహేందర్ సింగ్ ధోని. ముంబై నుంచి ఓ ప్రైవేట్ విమానంలో మధురై చేరుకున్న ధోనిని చూసేందుకు అభిమానులు తెల్లవారుజాము నుంచే విమానాశ్రయం వద్ద భారీగా గుమిగూడారు. వేలమ్మాళ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) సహకారంతో నిర్మించిన ఈ అంతర్జాతీయ స్థాయి స్టేడియం కోసం రూ. 300 కోట్లకు పైగా ఖర్చు చేశారు. 12.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న…