Site icon NTV Telugu

Mrunal Thakur: నాని, దుల్కర్ నా బిగ్గెస్ట్ చీర్ లీడర్స్.. వారి సపోర్ట్ మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్

Mrunal Thakur

Mrunal Thakur

టాలీవుడ్‌లో ‘సీతారామం’తో ఎంట్రీ ఇచ్చి అందరి మనసులు గెలుచుకున్న మృణాల్ ఠాకూర్, తాజాగా తన తోటి హీరోల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. హీరోలు దుల్కర్ సల్మాన్, నానిలు తనకి బిగ్గెస్ట్ చీర్ లీడర్స్ అని, వారు ఎప్పుడూ తనకు అండగా ఉంటూ సపోర్ట్ చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు. ‘సీతారామం’లో దుల్కర్‌తో, ‘హాయ్ నాన్న’లో నానితో ఆమె చేసిన మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, వారి మధ్య ఉన్న మంచి స్నేహాన్ని కూడా చాటి చెబుతోంది.

Also Read :Varun Tej: ‘బరి’ షూటింగ్‌లో వరుణ్ తేజ్‌కు అనుకోని ప్రమాదం!

మృణాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కేవలం సినిమాల్లోనే కాకుండా బయట కూడా తనకు మంచి స్నేహితులని, తన ఎదుగుదలను చూసి వారు ఎంతో సంతోషిస్తారని ఆమె వెల్లడించారు. ఈ క్రేజీ బ్యూటీ డెడికేషన్ చూసి అటు నాని, ఇటు దుల్కర్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ గా స్పందిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్, ఇలా తన కో-స్టార్స్ గురించి గొప్పగా చెప్పడం ఆమె సంస్కారానికి నిదర్శనమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Exit mobile version