Tariff on US Goods: అమెరికా 25 శాతం వేస్తే.. భారత్ కూడా అదే చేయాలి! ప్రధాని మోదీకి వ్యాపారుల లేఖ
- భారత్‌పై 25 శాతం సుంకాలకు యూఎస్ ప్రతిపాదన..
- అమెరికాపై కూడా ప్రతీకార సుంకాలు విధించాలని మోడీకి CTI లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tariff on US Goods: భారత్‌తో సహా పలు దేశాలపై సుంకాలు వేయాలని అమెరికా ప్రతిపాదించింది. భారత్‌పై 25 శాతం, చైనాపై 40 శాతం సుంకాలను వేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. అయితే, భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే 17 శాతం మాత్రమే సుంకాలు విధిస్తామని, ఒప్పందం కుదరకపోతే 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా చెబుతోంది.
ఇదిలా ఉంటే, భారత్ వస్తువులపై అమెరికా సుంకాలు విధిస్తే, అమెరికా దిగుమతులపై 25 శాతం ప్రతీకార సుంకాలు విధించాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరింది . అమెరికా సుంకాల వల్ల 48 బిలియన్ డాలర్ల ఎగుముతులపై ప్రభావం పడొచ్చని, 5 లక్షల మంది ఉద్యోగాలు ప్రమాదంలోకి వెళ్లొచ్చని CTI హెచ్చరించింది.
Also Read
- Space X Shares: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. పిల్లలకూ స్పేస్ ఎక్స్ షేర్లు ఇస్తాం..
- 26/11 Mumbai Attacks: ముంబై ఉగ్రదాడుల వెనుక మరో రహస్యం.. 18 ఏళ్లుగా వీడని పాక్ ఆర్మీ అధికారి మిస్టరీ!
- Nvidia: ఎన్విడియాలో మరో సంచలన ప్రేమకథ.. చైనా లింక్ ఉన్న సంస్థ ఎగ్జిక్యూటివ్‌తో సీఈఓ సన్నిహితుడి రహస్య వివాహం..?
- Netflix Pakistani content India: పాకిస్థానీ వెబ్ సిరీస్ వివాదం.. Netflixకు కేంద్రం కీలక సూచన!
అమెరికా ఏకపక్ష చర్యలపై ప్రతీకార చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నట్లు సీటీఐ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ గురువారం తెలిపారు. అమెరికా నుంచి భారత్‌కు ఆహార ఉత్పత్తులు, పానీయాలు, ఖనిజాలు, పప్పు ధాన్యాలు పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నాయి. వీటిపై భారత్ 25 శాతం సుంకాలు విధిస్తే దేశంలో అమెరికా ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని, తద్వారా నష్టపోయే అమెరికా వ్యాపారులు వారి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని గోయల్ వివరించారు.
అమెరికా సుంకాల వల్ల భారత్ ఉత్పత్తులైన వస్త్రాలు, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్, సీఫుడ్, రత్నాలు-ఆభరణాలు, తోలు, లోహాలు, ఆటో విడిభాగాల రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సుంకాల వల్ల అమెరికన్ మార్కెట్లో భారత వస్తువులకు ధరలు పెరిగితే, వాటికి బదులుగా వేరే దేశాలకు చెందిన వస్తువుల్ని అమెరికన్ ప్రజలు కొనుగోలు చేస్తారు. దీని వల్ల భారత ఉత్పత్తి, వ్యాపారులపై ప్రభావం పడుతుంది.
తాజావార్తలు
-
Tariff on US Goods: అమెరికా 25 శాతం వేస్తే.. భారత్ కూడా అదే చేయాలి! ప్రధాని మోదీకి వ్యాపారుల లేఖ
-
Space X Shares: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. పిల్లలకూ స్పేస్ ఎక్స్ షేర్లు ఇస్తాం..
-
26/11 Mumbai Attacks: ముంబై ఉగ్రదాడుల వెనుక మరో రహస్యం.. 18 ఏళ్లుగా వీడని పాక్ ఆర్మీ అధికారి మిస్టరీ!
-
Tollywood Box Office: పాటలతో పూనకాలు.. కథతో నీరసాలు! టాలీవుడ్లో ఇదేం వింత?
-
Nvidia: ఎన్విడియాలో మరో సంచలన ప్రేమకథ.. చైనా లింక్ ఉన్న సంస్థ ఎగ్జిక్యూటివ్‌తో సీఈఓ సన్నిహితుడి రహస్య వివాహం..?
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!