బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్ధం సభ ద్వారా వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
మేదరమెట్ల జాతీయ రహదారి పక్కన 4వ చివరి సిద్దం మహాసభ నిర్వహిస్తున్నామని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సిద్ధం సభ అనంతరం ఎన్నికల ప్రచారం మెుదలవుతుందన్నారు.
వైసీపీలో కింద స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద లీడర్ల వరకూ అందరినీ గౌరవంగా చూసుకుంటామని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీలో ఆత్మగౌరవ సమస్య అనేది రాదు.. అలా ఏ చర్యలు ఉండవన్నారు.