జాతిని జాగృతం చేసి, దేశాన్ని సమున్నత స్థాయిలో నిలపాలని కాంక్షించిన మహనీయుడు అంబేద్కర్. ఆ సమున్నత స్థాయిలో భారత దేశాన్ని నిలిపేందుకు వీలుగా ఆయన అతున్నత స్థాయిలో మేధోమధనం చేసిన మన రాజ్యాంగం… దేశానికి దశ, దిశను చూపటమే గాకుండా దాదాపు 75 ఏండ్లకు పైబడి మనకు మార్గదర్శనం చేస్తోంది. ఎంతో ముందు చూపుతో, మరెంతో దార్శనికతతో ఆయన రాసిన రాజ్యాంగం పౌరులకు సమాన హక్కులు, అవకాశాలను కల్పిస్తూ నవీన భారతాన్ని ఆవిష్కరిస్తోంది. ఆ రాజ్యాం నిర్మాత చూపిన బాటలోనే పయనిస్తూ… లోక్ సభ సభ్యుడిగా ఐదేండ్లు పూర్తి చేసుకున్న చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి… ఇప్పుడు మరోసారి ప్రజల ఆశీర్వాదం కోరుతున్నారు.
ఆ నియోజకవర్గం నుంచి వరసగా రెండోసారి బరిలోకి దిగిన ఆయన గత ఐదేండ్లుగా దళితులు, మైనారిటీలు, బడుగు, బలహీనవర్గాల వారి అభ్యున్నతే లక్ష్యంగా సేవలందిస్తున్నారు. ఆనాడు ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పంచశీల సూత్రాలతో దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తే… ఈనాడు రంజిత్ రెడ్డి నెహ్రూ గారి బాటలోనే తనదైన పంచ సూత్రాలను ఎంచుకుని చేవేళ్లను అభివృద్ధి పథాన తీర్చి దిద్దుతున్నారు. అందరికీ విద్య, అందరికీ వైద్యం, ఆరోగ్యం, సబ్బండ వర్గాల సంక్షేమం, సమానావకాశాలు, సమాంతర అభివృద్ధి, అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండటమనే ఐదు సూత్రాల ఆధారంగా చేవెళ్ల సమగ్రాభివృద్ధి కోసం కంకణబద్ధులై పని చేస్తున్నారు. ఆ రకంగా మరోసారి తనను ఆశీర్వదించి, ఎంపీగా గెలిపిస్తే, అందర్నీ అక్కున చేర్చుకుంటానని ప్రజలకు హామీ ఇస్తున్నారాయన. బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చూపిన బాటలో పయనిస్తూ…నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని మాటిస్తున్నారు రంజిత్ రెడ్డి.