26 కులాల జేఏసీ నేతలు గవర్నర్ ను కలిశారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత లక్ష్మణ్. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఏపీ నుండి వచ్చి ఈ 26 కులాల వాళ్ళ ఏళ్ల తరబడి ఇక్కడ ఉంటున్నారని, చిన్న చిన్న పనులు చేసుకుని ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ జాబితాలో ఉన్న వారిని రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక కలం పోటుతో కేసీఆర్ సర్కార్ వారిని బీసీ జాబితా నుండి తొలగించిందన్నారు. ఈ 26 కులాలు ఇక్కడ రిజర్వేషన్ సౌకర్యాలు పొందలేక పోతున్నారని, వారికి ఆంధ్రములాలు ఉన్నాయనే బీసీ జాబితా నుండి తొలగించారని ఆయన అన్నారు. ఓట్లు వచ్చినప్పుడు కాలుకు ముళ్ళు కుచ్చుకుంటే నోటితో తీస్తానని చెప్పిన సీఎం ఇపుడు వారిని ఒక కలం పోటుతో కడుపులో పొడిచారంటూ ఆయన విమర్శించారు.
Also Read :Mahesh Babu: తండ్రిని మర్చిపోలేని మహేష్.. కన్నీటి లేఖ
రెండు రాష్ట్రాలు బీసీలకు అన్యాయం చేస్తే సహించే ప్రసక్తే లేదని, వాళ్ళ హక్కుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. స్థానిక సంస్థల్లో ఏపీ, తెలంగాణ రెండు ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ లు తగ్గించాయని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ఇటీవల తెలంగాణలో జరుగుతున్న ఐటీ సోదాలపై స్పందిస్తూ.. ఐటీ దాడులు కొత్త కాదని, తప్పు చేయని వాళ్ళు జడుసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
Also Read : Pakistan: పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్
తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నట్లు.. సక్రమంగా ఎవరు కట్టకపోయినా ఇబ్బందులు తప్పవు. దీన్ని రాజకీయానికి ముడి పెట్టి డైవర్ట్ చేయడం సరికాదు. అధికారులు వారి పని వారు చేసుకుంటారు. రాజకీయంగా బీజేపీ ని ఎదుర్కోలేక కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే బీఎల్ సంతోష్ పేరును పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. దేశసేవ చేసే వ్యక్తిపై లేని పోని అభాండాలు వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరో నలుగురి పేర్లను పెట్టుకుని కావాలని కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. మేము రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు.