Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
Dharmapuri Arvind: కవిత కొత్త పార్టీపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది అన్నారు. సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే ప్రజలు వాళ్లను ఓడించి బీజేపీని గెలిపించారన్నారు. ఆమెకు రాజకీయ సమాధి కట్టింది బీజేపీ అని చెప్పారు. బీజేపీ సపోర్ట్ లేకండానే రాష్ట్రం వచ్చిందా? అని ప్రశ్నించారు. ఇటీవల ఎంపీ తేజస్వీ యాదవ్ పార్లమెంట్‌లో తెలంగాణ విభజన అంశంపై మాట్లాడిన తీరును అరవింద్ వివరించారు. ఇండియా- పాకిస్థాన్ ప్రక్రియలో ఎంతో మంది చనిపోయారని.. వీళ్ళు ప్రకటించి వెనక్కి తీసుకున్నారు కాబట్టే.. అంత మంది చనిపోయారని తేజస్వి అన్నట్లు తెలిపారు. “తేజస్వి మాటలను బీఆర్ఎస్ కళ్ళద్దాలతో చూడకండి. కవికి కేసీఆర్ రజనీకాంత్‌ల కనపడుతున్నారా..? కేసీఆర్ రోబో అయ్యారా..?” అని ప్రశ్నించారు. మరోవైపు.. కవిత కొత్త పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారని గుర్తు చేశారు. ఏ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తుంది.. అనేది ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్ల పాలనలో నరేంద్ర మోడీ అవినీతి రహిత పాలన అందించారని చెప్పారు. “గతంలో టీఆర్ఎస్.. ఇప్పుడు బీఆర్ఎస్ పుట్టబోయే బిడ్డ పేరు టీఆర్ఎస్ అంటా.. ఎన్ని పార్టీలు వచ్చినా.. ఎన్ని పార్టీలు ఉన్నా బీజేపీకి ఇబ్బంది లేదు.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.” అని రామచందర్‌రావు పేర్కొన్నారు.
READ MORE: Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
Also Read
- Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
- BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
- Kavitha: కవిత 'TRS' పార్టీ 5 భారీ హామీలు ఇవే.. విద్య, వైద్యం ఉచితం.. 4 లక్షల ఉద్యోగాలే లక్ష్యం!
- Kalvakuntla Kavitha: గుంట నక్కల మధ్య బందీ అయిన మనిషి కేసీఆర్.. కవిత సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్ అధినేత్రి కవిత పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీపై ఫైర్ అయ్యారు. తెలంగాణ నుంచి 7 మండలాలు లాక్కుంటే బీజేపీ ఎంపీలు మాట్లాడటం లేదన్నారు. “విభజన హామీలు నెరవేర్చకపోతే బీజేపీ ఎంపీలు మాట్లాడరు. సామాజిక న్యాయానికి బద్ధ వ్యతిరేకి బీజేపీ. తెలంగాణ బీజేపీ ఎంపీలకు సవాల్ విసురుతున్నా.. తెలంగాణ తల్లి బిడ్డలైతే ఏపీలో కలిసిన కనీసం 5 గ్రామాలను వెనక్కి వచ్చేలా చూడాలి. భద్రాచలం వద్ద ఉన్న 5 గ్రామాలు పోతే రాముడి గుడి మునుగుతుంది. గ్రామాలను వెనక్కి తీసుకురావడానికి జాగృతి తరఫున కేంద్రానికి లేఖ రాశాం. మూడు పార్టీలపై అలుపెరగని పోరాటానికి కార్యకర్తలంతా సిద్ధం కావాలి’’ అని కవిత పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
-
Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
-
Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
-
Swati Maliwal: ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్‌లోనే తొలి టీమ్‌గా..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!