CM Chandrababu Naidu: వారం రోజులే గడువు.. క్షేత్రస్థాయికి వెళ్లండి, ప్రజల్లో ఉంటే తిరుగుండదు..! నేతలకు సీఎం కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Naidu: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి అభ్యర్థులు, బూత్ స్థాయి కార్యకర్తలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సైతం వైసీపీ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేసే కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. రాజకీయాల్లో వైఎస్ జగన్ లాంటి క్రిమినల్ లిటిగెంట్లు ఉండటం రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి తీవ్ర ముప్పుగా మారిందని సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ స్థానిక సమరంలో కూటమి అభ్యర్థుల గెలుపే ఏకైక లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు పరస్పర సమన్వయంతో ముందుకెళ్లాలని సీఎం పిలుపునిచ్చారు. అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఫలితాల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వారికి ప్రాధాన్యతనిస్తూ కూటమి మంచి అభ్యర్థులను రంగంలోకి దించిందని ఆయన స్పష్టం చేశారు. అయితే వైసీపీ మాత్రం విధ్వంసకారులనే ఎంపిక చేసి బరిలోకి దించుతోందని ధ్వజమెత్తారు. తానే విధ్వంసాలకు పాల్పడటం, మళ్లీ తానే కోర్టులకు వెళ్లి స్టేలు తేవడం జగన్ లాంటి వికృత మనస్తత్వం కలిగిన క్రిమినల్ లిటిగెంట్లకే చెల్లుతుందని, లిటిగెంట్లతో అభివృద్ధిని, ఎన్నికలను అడ్డుకోవడమే ఆ పార్టీ ప్రధాన పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Pakistan: విదేశాలకు పాక్ అధికారుల వలస.. రక్షణమంత్రి సంచలన వ్యాఖ్యలు..
- 12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
- Gujarat Man Suicide: భార్య, అత్తింటి వేధింపులు.. కొండపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య..
- Donga Naa Koduku Teaser: ఏంటి మౌళి.. పబ్లిక్‌గా టిఫిన్ చేసేస్తున్నావ్..! ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల..
అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను న్యాయపరంగా అడ్డుకోవడమే ప్రతిపక్షం అలవాటుగా మార్చుకుందని సీఎం వివరించారు. SIR సర్వేపై నమ్మకం లేదంటూనే, మరోవైపు అదే సర్వే పూర్తయ్యే వరకు స్థానిక ఎన్నికలను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు. ఓటర్ల జాబితా, బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు దాదాపు 60కి పైగా పిటిషన్లు వేశారని, చివరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ను ఆపేందుకు ఏకంగా 300 పిటిషన్లు దాఖలు చేశారని నిలదీశారు. అంతేకాకుండా రాష్ట్ర జీవనాడి పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణాలను అడ్డుకోవడానికి కోర్టులకు వెళ్లడమే కాకుండా విషపూరిత లేఖలు రాశారని ఆరోపించారు.
మున్సిపాలిటీల్లో ఉత్తమ అభ్యర్థులను ఖరారు చేసే కసరత్తులో తాము బిజీగా ఉంటే.. వైసీపీ అధ్యక్షుడు జగన్ బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చొని ఏయే ప్రాంతాల్లోకి ఏ రాష్ట్రం నుంచి గూండాలను దించాలో కుట్రలు పన్నుతున్నారని సీఎం దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తుల ఆలోచనలు ఇలాగే ఉంటాయని, ఇలాంటి వికృత మనస్తత్వం ఉన్నవారిని ప్రజలే రాజకీయాలకు పూర్తిగా దూరం ఉంచాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కేవలం వారం రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉందని, కూటమి నాయకులంతా తక్షణమే క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల్లో మమేకం కావాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజలకు వివరిస్తూనే, వైసీపీ చేస్తున్న అరాచకాలను, అభివృద్ధి నిరోధక చర్యలను ఎండగట్టాలని, ప్రజల్లో ఉంటే తిరుగులేని విజయం సాధిస్తామని చంద్రబాబు నాయుడు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: వారం రోజులే గడువు.. క్షేత్రస్థాయికి వెళ్లండి, ప్రజల్లో ఉంటే తిరుగుండదు..! నేతలకు సీఎం కీలక ఆదేశాలు..
-
Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: ‘రుద్రవనం’లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
-
RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?
-
Pakistan: విదేశాలకు పాక్ అధికారుల వలస.. రక్షణమంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!