Pakistan: విదేశాలకు పాక్ అధికారుల వలస.. రక్షణమంత్రి సంచలన వ్యాఖ్యలు..
- విదేశాలకు వలస వెళ్తున్న పాక్ ప్రభుత్వ అధికారులు..
- వలసలపై ఆ దేశ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగంలో ఉండగానే విదేశాల్లో శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. కెనడా, అమెరికా, బ్రిటన్‌తో పాటు పలు యూరప్ దేశాలకు పాకిస్తాన్ అధికారులు వలస వెళ్లిపోతున్నారని అన్నారు. ఈ పరిణామం దేశం పట్ల, తమ విధుల పట్ల అధికారులకు ఉన్న నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని వ్యాఖ్యానించారు.
గత కొన్నేళ్లుగా పలువురు అధికారులు విదేశాల్లో శాశ్వత నివాసం కోసం ప్లాన్ చేసుకుంటున్నారని ఆయన ఎక్స్ వేదికగా అన్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడే ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. పాకిస్తాన్ బ్యూరోక్రాట్లకు పోర్చుగల్ ఇటీవలి కాలంలో ముఖ్యమైన గమ్యస్థానంగా మారిందని అన్నారు. విదేశాల్లో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసేందుకు అధికారులకు సహాయం చేసే వ్యక్తి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి పారిపోయినట్లు ఆసిఫ్ ఆరోపించారు. అయితే, ఆ వ్యక్తి వివరాలు, దానికి సంబంధించిన ఆధారాలు ఆయన బహిరంగంగా వెల్లడించలేదు.
Also Read
- Marco Rubio: భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోము.. నిరసనలపై మార్కో రూబియో..
- Trump: గత ఒప్పందాల కంటే భిన్నంగా ఉంటుంది.. భారత్-అమెరికా వాణిజ్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Zohran Mamdani: భారతీయులతో కలిసి గర్బా డ్యాన్స్ చేసిన న్యూయార్క్ మేయర్
- Sudan Drone Attack: సూడాన్‌లో డ్రోన్ దాడి.. పిల్లలతో సహా 153 మంది మృతి..!
ఈ వ్యాఖ్యలు మరోసారి పాకిస్తాన్లో సంచలనంగా మారాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య సంబంధాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రభావం పెరుగుతోందని నివేదికలు చెబుతున్న వేళ ఆసిఫ్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
తాజావార్తలు
-
RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?
-
Pakistan: విదేశాలకు పాక్ అధికారుల వలస.. రక్షణమంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
Gujarat Man Suicide: భార్య, అత్తింటి వేధింపులు.. కొండపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య..
-
Mouli: వీడేం చేయగలడు, బచ్చాగాడు అనుకున్నారు..పెద్ద ఫ్యామిలీ యాక్టర్ అయితే ఇలా చేసేవారా?
ట్రెండింగ్
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!