ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుమార్చడం బిల్లు పెట్టడం.. ఆమోదించడం గురించి తెలిసిందే. అయితే.. ఈ విషయమై విపక్ష నేతలు అధికార వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరును యూనివర్శిటీకి తీసేయ్యడం అంటే అగౌరపరిచినట్టేనన్నారు. భవిష్యత్ లో కడపకు వైఎస్సార్ పేరును తోలగించడానికి మార్గం చూపించిన వాళ్ళు అవ్వవొద్దని ఆయన హితవు పలికారు. అమరావతి రైతులకు బీజేపీ వెన్నంటి ఉండగా పాదయాత్రను ఎవరు అడ్డుకోలేరని, అవసరమైతే వారికి రక్షణగా నిలబడతామన్నారు. వైసీపీ తాము చేసే తప్పుడు పనులన్నీ కేంద్రానికి చెప్పే చేస్తున్నామనే ప్రచారంలో నిజం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
బాబాయ్ హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసిన సీబీఐ ఆధారాలను సేకరించిందని ఆయన వెల్లడించారు. ఇప్పటికీ సీబీఐ పులివెందులలోనే ఉందని ఆయన వెల్లడించారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి మూడు సీట్లు కూడా రావని ఆయన అన్నారు. గుట్కా, మట్కా, బెట్టింగులతో అధికారపార్టీ నడుస్తోందని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యేలు గుట్కా డీలర్లుగా మారారని, లిక్కర్, డ్రగ్స్, గంజాయి రాష్ట్రాన్ని పాలిస్తున్నాయన్నారు.