YS Avinash Reddy: హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాష్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నుండి పులివెందుల బయల్దేరారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. మధ్యాహ్నం 3గంటలకు పులివెందులకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు ఎంపీ అవినాష్. ప్రతి సోమవారం పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఈ రోజు ప్రజాదర్బార్ లో వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొంటున్నట్లు కార్యకర్తలకు సమాచారం అందించారు సీఎం క్యాంప్ కార్యాలయం అధికారులు.ఇదిలా ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరవుతారా? లేదా? అనే సందిగ్థత తొలుత ఏర్పడింది. హైకోర్టులో ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అవినాష్ రెడ్డి…ఇవాళ ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారించనుంది హైకోర్టు.
Read Also: NIA Raids: పలు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు..
Also Read
- IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
- AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
హైకోర్టు విచారణ తరువాత సీబిఐకి వస్తారా లేక ముందే వస్తారా అన్న అంశంపై ఉత్కంఠకు తెరపడింది. ..మరోవైపు హైదరాబాద్ లోని అవినాష్ రెడ్డి ఉంటున్న ఇంటికి ఉదయం భారీగా చేరుకున్న కార్యకర్తలు, అభిమానులు ఆయన పులివెందులకు బయలుదేరడంతో అక్కడినించి వెనుతిరిగారు. సోమవారం అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కన పెట్టింది సుప్రీంకోర్టు.. అవినాష్ ముందస్తు బెయిల్ ఉత్తర్వులను నిలిపివేసింది.
తెలంగాణ హైకోర్టు అలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని స్పష్టం చేసింది.. సీబీఐకి హైకోర్టు అలాంటి నిబంధనలను విధించడం సరికాదని పేర్కొన్న సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశాల వల్ల సీబీఐ దర్యాప్తుపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.. మరోవైపు.. జూన్ నెలాఖరు వరకు సీబీఐ దర్యాప్తు గడువును ఈ సందర్భంగా పొడిగించింది సీజేఐ ధర్మాసనం.. కాగా, ఈ నెల 25వ తేదీ వరకు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ సునీత.. గత శుక్రవారం ఈ పిటిషన్‌పై తొలిసారి విచారణ జరిగింది.. హైకోర్టు ఉత్తర్వులను తప్పుబట్టిన సుప్రీం.. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈరోజు హైకోర్ట్ లో ఏం జరగబోతోంది? సీబీఐ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆసక్తిగా మారింది.
Read Also: NIA Raids: పలు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు..
తాజావార్తలు
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!