Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ అయితే అతివృష్టి.. లేదా అనావృష్టి అన్నట్టు ఉంది పరిస్థితి. ఈ ఏడాది మొదటి అయిదు – ఆరు నెలలు పెద్దగా సినిమాలు రిలీజ్ కాలేదు. జస్ట్ ఒకటి రెండు హిట్స్ మాత్రమే కనిపించాయి. కానీ గత రెండు నెలలు నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. విశ్వనాధ్ అండ్ సన్స్, DC, స్పైడర్ మ్యాన్ వంటి సినిమాలు భారీ వసూళ్లు రాబట్టాయి. ఇక గతవారం విడుదలైన రవితేజ ఇరుముడి దుమ్ముదులుపుతోంది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి భారీ లాభాల దిశగా వెళ్తోంది.
అయితే ఇప్పడు టాలీవుడ్ సినీ వర్గాల్లోనూ, ముఖ్యంగా తెలంగాణ థియేటర్ బిజినెస్‌లోనూ రెండవ వారం థియేటర్ల కేటాయింపు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, నాగవంశీ వంటి అగ్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఈ వారం అసలైన పరీక్ష ఎదురుకాబోతోంది. ఒకవైపు ఇరుముడి మంచి ఆక్యుపెన్సీతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు తెస్తుంటే మరోవైపు పాన్-ఇండియా స్థాయి క్రేజ్‌తో టాక్సిక్ మూవీ భారీ స్థాయి విడుదలకు సిద్ధమవుతోంది. నైజాంలో ఈ సినిమాను దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. వీటి మధ్యలో విశ్వనాధ్ అండ్ సన్స్, డీసీ చిత్రాలు కూడా మంచి వసూళ్లు రాబడుతున్నాయి.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
ఇప్పుడు సమస్య ఏంటంటే ‘టాక్సిక్’ సినిమా కోసం స్క్రీన్ల సంఖ్యను పెంచితే, ప్రస్తుతం మంచి ఆక్యుపెన్సీతో నడుస్తున్న ‘ఇరుముడి’కి వసూళ్లు తగ్గుతాయి. డబ్బింగ్ సినిమా కోసం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాగా ఆడుతున్న సినిమాల స్క్రీన్లను తగ్గించడం ఎంతవరకు సమంజసం. థియేటర్ల కేటాయింపులు అనేది ప్రేక్షకుల డిమాండ్‌ను బట్టి జరగాలా లేదా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పవర్ ఆధారంగా జరగాలా అనే ప్రశ్నలు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నా చివరికి ప్రేక్షకుల ఆదరణే గెలుస్తుందా లేదా పెద్ద బ్యానర్ల ఆధిపత్యమే నడుస్తుందా అనేది ఈ వారం తెలంగాణ థియేటర్ బిజినెస్ నిర్ణయించనుంది.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!