Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashasvi Jaiswal vs Asitha Fernando: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరంభం అదరగొట్టినా, ముగింపు మాత్రం కాస్త రసాభాసగా మారింది. క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లపై విరుచుకుపడిన జైస్వాల్, అవుటైన తర్వాత శ్రీలంక పేసర్ అసిథ ఫెర్నాండోతో గొడవకు దిగడం మైదానంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. జైస్వాల్ మొదటి నుంచే శ్రీలంక బౌలర్లను టార్గెట్ చేస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 53 బంతుల్లో 9 ఫోర్లతో 45 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న జైస్వాల్‌ను అడ్డుకోవడానికి లంక పేసర్ ఫెర్నాండో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తొలుత తీవ్ర ఒత్తిడికి గురైన ఫెర్నాండో, 17వ ఓవర్ ఆఖరి బంతికి వికెట్ పడగొట్టాడు. రౌండ్ ది వికెట్ నుంచి బంతిని లోపలికి స్వింగ్ చేస్తూ వేయగా, కవర్స్ దిశగా షాట్ ఆడబోయిన జైస్వాల్ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఈ భారీ వికెట్ పడటంతో ఆనందంతో ఊగిపోయిన ఫెర్నాండో, జైస్వాల్ వైపు చూస్తూ సెండ్ ఆఫ్ ఇస్తున్నట్లు సైగలు చేశాడు. పెవిలియన్ వైపు వెళ్తున్న జైస్వాల్‌ను ఉద్దేశించి ఫెర్నాండో ఏదో అనడంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన భారత ఓపెనర్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి బౌలర్ వైపు దూసుకొచ్చాడు. ఇద్దరూ ముఖాముఖి తలపడటమే కాకుండా, జైస్వాల్ తన హెల్మెట్‌తో ఫెర్నాండోను సల్పంగా తాకినట్లు (హెడ్ కాంటాక్ట్) కనిపించింది. వాతావరణం మరింత వేడెక్కడంతో శ్రీలంక ఆటగాళ్లు వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరినీ పక్కకు లాగి గొడవను సర్దుమొదగించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆరంభంలో ఓపెనర్లు కుదురుగా ఆడినా, క్రమంగా శ్రీలంక బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించారు. కేఎల్ రాహుల్ (18) లహిరు కుమార బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, కొద్దిసేపటికే జైస్వాల్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో తొలి సెషన్ ముగిసే సమయానికి భారత్ 66 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కాస్త కష్టాల్లో పడింది. మంచి ఆరంభాన్ని ఇచ్చినా, కొలంబో పిచ్ నుంచి లభిస్తున్న సహాయాన్ని వాడుకుంటూ శ్రీలంక బౌలర్లు లంచ్ సమయానికి మ్యాచ్‌ను సమం చేయగలిగారు.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!