జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబంపై ఉచ్చు బిగిస్తున్నామని, స్వయంగా మోడీని ఈ మాట చెప్పాక మేం బీ టీమ్ ఎలా అవుతామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లకుండా గ్యారంటీ ఇస్తారా అని ఆయన అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా బీఆర్‌ఎస్‌లో చేరరని, 2014, 2018 లో మూడో వంతు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ లో చేరలేదా అని ఆయన ప్రశ్నించారు. జైలుకు బావతో వెళ్లాలని అక్క (కవిత) కోరుకుంటున్నట్లు ఉందన్నారు ఎంపీ అర్వింద్. అయితే.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మార్పు అధిష్టానం నిర్ణయమన్నారు. పసుపు బోర్డ్ కంటే నేను ఎక్కువే సాధించానని ఆయన వెల్లడించారు.
Also Read : HD Kumaraswamy: జేడీఎస్‌ను దూరం పెట్టేశారా? యూపీఏ, ఎన్జీయే నుంచి అందని ఆహ్వానం
ఇదిలా ఉంటే.. నిన్న ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. రోడ్లు భవనాల శాఖలో 5221 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. నాలుగేళ్లలో డబుల్ బిల్లింగ్ ద్వారా మంత్రి ప్రశాంత్ రెడ్డి నిధులను నొక్కేశారని ఆయన మండిపడ్డారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 318 కోట్ల స్కామ్ జరిగిందని, 51 పనుల్లో 33 పనులు తన సొంత సెగ్మెంట్ బాల్కొండ లోనే చేపట్టారు మంత్రి అని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే పనికి రెండు రకాల నిధులు వినియోగించారని, తప్పుడు నివేదికలు సమర్పించారన్నారు. జరిగిన పనుల్లోనూ 25 శాతం కమిషన్ లు తీసుకున్నారని, తెలంగాణకు ప్రధాని మోడీ ఇచ్చిన నిధులను, కేసీఆర్ కుటుంబానికి మళ్లిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన అవినీతి పై విచారణ జరిపించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశామని ఆయన అన్నారు.
Also Read : Saindhav: చిన్న పాప కోసం పోస్టరా? ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మైక్!