భారతదేశ చిత్రపరిశ్రమలో స్పోర్ట్స్ డ్రామా మూవీస్ కొత్తేమి కాదు. ఈ క్రీడా నేపథ్య సినిమాలలోనూ ఓ పక్క కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇలాంటి వాటిలో ఉండే హీరోయిజం కాస్తా ప్రజలకి స్ఫూర్తిదాయకంగానూ ఉంటుంది. అందుకే కాబోలు.. ఇలాంటి మంచి కథలు దొరికినప్పుడు సినిమాగా చేసేందుకు ముందుకొస్తుంటారు చాలామంది యాక్టర్స్. మరి త్వరలోనే ఆటగాడిగా సందడి చేసేందుకు సిద్ధమవుతున్న వారెవరో ఓ లుక్ వేద్దాం.
Also Read: Rajamouli : జపాన్ లో RRR సినిమా రీరిలీజ్.. రాజమౌళి ఎమోషనల్ పోస్ట్..
ఈ లిస్ట్ లో మొదటగా అభిలాష్ దర్శకత్వంలో హీరోగా శర్వానంద్ బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతుంది. ఇందులో శర్వానంద్ బైక్ రేసర్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా మాళవిక నాయర్ హీరోయిన్ గా చేస్తున్నారు. ఇదే లిస్ట్ లో ‘సార్పట్ట – 2’ సినిమా కూడా ఒకటి. సార్పట్టలో బాక్సర్‌గా కనిపించి ఆకట్టుకున్న తమిళ హీరో ఆర్య ప్రస్తుతం సార్పట్ట 2 కోసం కష్టపడుతున్నారు. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన బాక్సర్‌గా కనిపించనున్నారు.
Also Read: IPL 2024: రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్!
బుచ్చిబాబు దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబోలో వస్తోన్న చిత్రం ఆర్‌సీ16. ఈ సినిమాను వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా ఇందులో చరణ్ ఏ క్రీడాకారుడిగా కనిపిస్తారన్నది ఇంకా క్లారిటీ లేదు. ముఖ్యంగా ఫుల్ బాల్, కబడ్డీ సంబంధించి ఏదో ఒకదాని బ్యాక్ డ్రాప్ తో సినిమా ఉంటుందని సమాచారం. ఈ నెల 20న సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించనుంది.
కబడ్డీ క్రీడాకారుడు మానతి పి.గణేశన్ లైఫ్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా.. తమిళ హీరో ధ్రువ్ విక్రమ్ కాంబోలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఇద్దరూ కబడ్డీ క్రీడాకారులగా నటిస్తున్నట్లు సమాచారం.ఇదివరకు కేవలం క్రికెట్, హాకీ, కబడ్డీ, బాక్సింగ్, రన్నింగ్, రగ్బీ లాంటి సినిమాలే రాగా.. మొదటిసారి పతంగుల కాంపిటీషన్ బ్యాక్ డ్రాప్ తో ‘పతంగ్’ అనే ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాకి ప్రణీత్ పత్తిపాటి దర్శకత్వం వహిస్తుండగా.. వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాలు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఇదే బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం ‘టెస్ట్’. ఇందులో నయనతార, ఆర్.మాధవన్, సిద్ధార్థ్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో రాబోతుంది. ఇదివరకు చెన్నైలో జరిగిన ఓ చారిత్రక అంతర్జాతీయ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఆ ముగ్గురి జీవితాల్ని తీవ్రంగా ఎలా ప్రభావితం చేసిందనేదే ఈ చిత్రం కధాంశం.