NTV Telugu Site icon

Dil Raju: తెలంగాణ ప్రజానికానికి దిల్‌రాజు క్షమాపణలు..

Dil Raju

Dil Raju

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను లాంచ్ చేయగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ మైదానంలో సోమవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేశారు.

READ MORE: Sankranthi Rush: పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. టోల్ ప్లాజాల దగ్గర రద్దీ

ఈవెంట్లో దిల్‌రాజు మాట్లాడుతూ.. “తెలంగాణలో సినిమాలు తక్కువ కాబట్టి జనాల నుంచి రియాక్షన్ తక్కువ వస్తుందని నేను డైరెక్టర్ కి చెప్పాను. అదే ఆంధ్రకు వెళితే సినిమాకు ఒక మంచి వైబ్ ఇస్తారు. ఇక్కడ తెల్ల కల్లు, మటన్ ను జనాలు ఆ రేంజ్ లో ఇష్టపడతారు.” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అయ్యాయి. తెలంగాణ ప్రజలను అమానించారంటూ సోషల్ మీడియాలో వీడియో, వార్తలు వైరల్‌గా మారాయి. దీంతో తాజాగా స్పందించిన నిర్మాత దిల్‌రాజు క్షమాపణలు చెప్పారు.

READ MORE: Sankranthi Rush: పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. టోల్ ప్లాజాల దగ్గర రద్దీ

‘‘నేను నిజామాబాద్‌ వాసిని. నిజామాబాద్ జిల్లాతో నాకు అనుబంధం ఉంది. అందుకే ఈ సినిమా ఈవెంట్ అక్కడ చేశాం. గతంలో ఫిదా సక్సెస్ మీట్ తర్వాత జిల్లాలో జరిగిన అతిపెద్ద సినిమా ఈవెంట్ ఇది. ఆ ఈవెంట్‌లో నేను మటన్ తెల్ల కల్లు గురించి మాట్లాడాను. అయితే.. నేను తెలంగాణాను అవమానించానని.. హేళన చేశానని మిత్రులు కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిసింది. నా ఉద్ధేశ్యం అదే స్పీచ్‌లో లాస్ట్‌లో చెప్పడం జరిగింది. మన కల్చర్, దావత్ మిస్ అవుతున్నాను. సంక్రాంతికి రెండు సినిమాలు విడుదల చేశాక.. మా తెలంగాణ కల్చర్ దావత్ చేసుకోవాలని ఉందన్నాను. మన కల్చర్‌ను అభిమానిస్తాను. నిజంగా ఆ మాట వల్ల బాధపడి ఉంటే క్షమించండి.. నా ఉద్ధేశం అది కాదు.. బాన్సువాడలోనే ‘ఫిదా’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆ సినిమా తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేసింది. ‘బలగం’ చిత్రాన్ని తెలంగాణ సమాజం మొత్తం ఆదరించింది. అన్ని రాజకీయ పార్టీలు ‘బలగం’ చిత్రాన్ని అభినందించారు. తెలంగాణ వాసిగా నేను ఏవిధంగా ఈ రాష్ట్రాన్ని హేళన చేస్తాను. మానోభావాలు దెబ్బతిన్న కొందరికి క్షమాపణలు చెబుతున్నారు’’ అని పేర్కొన్నారు.

Show comments