Mokshagna : ఇప్పటికే తొమ్మిదేళ్లు వృధా.. ఇంకా లేటంటే ఎలా మోక్షజ్ఞ
- మరోసారి వాయిదా పడిన మోక్షజ్ఞ ఎంట్రీ
- `ఆదిత్య 999 మ్యాక్స్` తో బాలయ్య లాంచ్ చేసే ఆలోచన
- నాగ్ అశ్విన్ చేస్తాడంటూ ఊహాగానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mokshagna : నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ అందని ద్రాక్షలా అభిమానులను ఊరిస్తూనే ఉంది. ఇంతలో ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా ప్రకటించారు. ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ ఎంతవరకు జరిగిందో తెలియదు. ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. కొందరు చెబుతున్న దాని ప్రకారం.. మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ సినిమా ఆగలేదు.. తాత్కాలికంగా ఆగిపోయిందని చెబుతున్నారు. వాస్తవానికి అన్ని అనుకున్నట్లు జరిగితే నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పటికే అయిపోవాల్సి ఉంది. కానీ ఇంత వరకూ ఆ అవకాశం లేకుండా పోయింది. ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ తో మోక్షజ్ఞ లాంచ్ అవ్వాలి. డిసెంబర్ లో ముహూర్తం కూడా పెట్టారు. కానీ చివరి నిమిషంలో అది కార్యరూపం దాల్చలేదు. మోక్షజ్జ ఎంట్రీపై రకరకరకాల కథనాలు అంతే ఆసక్తిని రేకెత్తించాయి. డెబ్యూ `కల్కి` డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల్లోకి వెళ్లిందని ప్రచారం జరుగుతుంది, మరికొంత మంది బాలయ్య డైరెక్షన్లో `ఆదిత్య 999 మ్యాక్స్` తో తన కొడుకును లాంచ్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Read Also:Bank Of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు..
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
`ఆదిత్య 999` స్టోరీ కూడా బాలయ్య రెడీ చేశారట. ఆ కథని తానే డైరెక్ట్ చేస్తానని కూడా ప్రకటించారు. మరి అదైనా జరుగుతుందా? అంటే అదీ ఇప్పటి వరకు క్లారిటీ లేదు. బాలయ్య వేర్వేరు సినిమాలతో బిజీ అవుతున్నారు తప్ప తనయుడి ఎంట్రీ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. అటు నాగ్ అశ్విన్ నుంచి కూడా ఎలాంటి సమాచారం ఇంత వరకు బయటకు రాలేదు. ఆయన కల్కి సెకండ్ పార్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరో వైపు ప్రశాంత్ వర్మ అన్ని రెడీ చేసుకున్నా? అతడిని ఎందుకో హోల్డ్ లో పెట్టాడు. ఇలా మోక్షజ్ఞ ఎంట్రీపై ఊహాగానాలు మొదలయ్యాయి. మరి కొత్త ఏడాదిలోనైనా లాంచ్ చేస్తారా? అంటే దానిపైనా క్లారిటీ లేదు. దీంతో మోక్షజ్ఞ సినిమాపై అసలేం జరుగుతుంది అన్నతి అర్థం కాని పరిస్థితుల్లోకి దారి తీస్తుంది. మోక్షజ్ఞ మాత్రం ఇప్పటికే అమెరికాలో యాక్టింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని రెడీగా ఉన్నాడు. ప్రస్తుతం అతడి వయసు 30 ఏళ్లు. స్టార్ కిడ్స్ అంతా 21 లో నే లాంచ్ అవుతున్నారు. సక్సెస్ అయితే 30 ఏళ్లు వచ్చేసరికి తొమ్మిదేళ్ల కు సీనియర్ గా మారిపోతున్నారు. ఆ రకంగా చూసుకుంటే మోక్షజ్ఞ చాలా ఎక్స్ పీరియన్స్ కోల్పోయినట్లే.
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!