Last Selfie : రాజన్ నేను చనిపోతున్నాను.. అంటూ భర్తకు ఉరేసుకుంటున్నట్లు సెల్ఫీ తీసుకుని పంపింది. ఎంత సేపటికీ భర్త రిప్లై ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నేపాల్‌కు చెందిన రాజన్ పర్వార్ టిక్‌టాక్‌లు చేస్తున్న పూజను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులు ఏడాదిన్నర క్రితం నేపాల్ నుంచి నగరానికి వలసవచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10 లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలోని ఓ ఇంట్లో పని చేస్తున్నారు. కొంత కాలంగా భర్త తనను పట్టించుకోవడం లేదని పూజ ఆరోపిస్తూ ఉండేది. అతను మరొకరితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని సన్నిహితుల దగ్గర మొర పెట్టుకుంది.
Read Also: Attack On Hindu Temple: హిందూ ఆలయంపై దుండగుల దాడి.. ఏడాదిలో ఇది మూడోసారి
భర్త తనను పట్టించుకోకపోవడంతో బతకాలని లేదంటూ ఇంటి యజమాని వద్ద కూడా వాపోయింది. ఆదివారం సాయంత్రం రాజన్ విధుల్లో ఉండగా బాత్‌రూమ్‌లోకి వెళ్లిన పూజ ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సెల్పీ తీసి భర్తకు పంపింది. అయితే రాజన్ విధుల్లో ఉండి రెండు గంటలు గడిచినా ఆ ఫొటో చూసుకోలేదు. భర్త నుంచి ఎంత సేపటికీ రిప్లై రాకపోవడంతో మనస్తాపానికి లోనైన ఆమె బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఇంటికి వచ్చిన రాజన్ భార్య ఎంతకూ బయటికి రాకపోయేసరికి అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూశాడు. పూజ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఇంటి యజమాని, రాజన్ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లే సరికి ఆమె చనిపోయింది. జూబ్లీహిల్స్ పోలీసులు రాజన్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Fire Accident: అమరరాజా గ్రోత్ కారిడార్ లో భారీ అగ్నిప్రమాదం