Site icon NTV Telugu

Sangareddy: ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లి.. తానూ ఆత్మహత్యాయత్నం..

Suicide

Suicide

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. తల్లి ముగ్గురు చిన్నారులను అన్నంలో విషం కలిపి తినిపించింది. తాను ఆహారం ద్వారా విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు చిన్నారులు పిల్లలు సాయి కృష్ణ (12), మధుప్రియా (10), గౌతమ్ (8) మృతిచెందారు. తల్లి రజిత తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

READ MORE: Husband kills wife : భార్యను ముక్కలు, ముక్కలుగా నరికి.. సూట్‌కేస్‌లో దాచిపెట్టిన భర్త.. తర్వాత…

రజిత భర్త రాత్రి డ్యూటీకి వెళ్లగా, ఉదయం ఇంటికి వచ్చి ఈ భయంకర దృశ్యాన్ని చూశాడు. స్థానికుల సహాయంతో వెంటనే బీరంగూడ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి పరిస్థితి విషమంగా ఉంది. పిల్లల్ని చంపడానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఎలాంటి కుటుంబ కలహాలు ఉన్నాయా, లేదా ఆర్థిక సమస్యలున్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

READ MORE: Veera Dheera Shoora Review: వీర ధీర శూర రివ్యూ

Exit mobile version