సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. తల్లి ముగ్గురు చిన్నారులను అన్నంలో విషం కలిపి తినిపించింది. తాను ఆహారం ద్వారా విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు చిన్నారులు పిల్లలు సాయి కృష్ణ (12), మధుప్రియా (10), గౌతమ్ (8) మృతిచెందారు. తల్లి రజిత తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.