Instagram Love: నాకు ప్రియుడే కావాలి.. కన్నబిడ్డను బస్టాండ్ లో వదిలి తల్లి జంప్
- ఇన్‌స్టా గ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో స్నేహం ప్రేమగా
- బిడ్డను వదిలి ప్రియుడితో పారిపోయిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవత్వం మంటగలిసిపోతోంది.. పేగు బంధం ప్రశ్నార్థకం అవుతోంది.. ముక్కు మొఖం తెలియని వ్యక్తులతో ఆన్ లైన్ ప్రేమలు.. కట్టుకున్న వాళ్లను, కన్నవాళ్ళని వదిలేసి చెక్కేస్తున్నారు.. తీరా కొన్నాళ్ళు పోయాక.. మోజు తీరిపోతోంది.. కళ్ళు తెరిచేలోపే… పాపం ప్రాణాంతకం అవుతోంది… జీవితాలు.. కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి… హత్యలు అరాచకాలు చివరి అంకం అవుతున్నాయి.. ఇన్‌స్టా గ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో స్నేహం ప్రేమగా మారింది..
Also Read:Bank Holidays in August 2025: వచ్చే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే?
Also Read
ప్రియుడు తనవెంట రమ్మని వెంటపడడంతో… ముక్కుపచ్చలారని కన్నబిడ్డ ను దిక్కు లేని అనాధగా బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళింది ఓ మానవత్వం లేని తల్లి.. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియక బిక్కు బిక్కు మంటూ ఉండిపోయిన బిడ్డడిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వడంతో… వారు వచ్చి సీసీ కెమెరాల ఆధారంగా ముందు తల్లి ఆనవాలు గుర్తించి… ఆమె భర్తకు సమాచారమిచ్చి పిలిపించి.. బిడ్డను ఆయనకు అప్పగించారు… ఈ దారుణమైన ఘటన నల్గొండ బస్ స్టాండ్ లో చోటు చేసుకుంది..
Also Read:Intel layoffs: 25,000 మంది ఉద్యోగుల్ని తొలగించనున్న ఇంటెల్..
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో.. ఓ మహిళ 15 నెలల కొడుకుని వదిలేసి.. వేరే యువకుడితో బైక్ మీద వెళ్లిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నల్లగొండ పట్టణంలోని పాత బస్తీకి చెందిన ఒక యువకుడితో.. హైద్రాబాద్ కు చెందిన నవీన అనే మహిళ ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయ్యింది. మహిళకు పెళ్లి అయ్యి.. 15 నెలల బాబు ధనుష్ ఉన్నాడు. ఈ క్రమంలోనే.. భర్తను,15 నెలల పిల్లాడిని వదిలేసి మహిళ వెళ్లేందుకు ప్లాన్ వేసింది. డైరెక్ట్ గా నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ కు బాబుతో పాటు వచ్చి.. ఆ బాబును బస్టాండ్ లోనే వదిలేసి వెళ్ళింది. ఆ తర్వాత.. ఆ పిల్లవాడు తల్లి కోసం వెతుకుతూ ఏడవడం చూసిన ప్రయాణికులు, డిపో సిబ్బంది.. నల్లగొండ టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read:Sandalwood : వరుసగా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్న సీనియర్ హీరో
టూటౌన్ ఎస్సై సైదులు వెంటనే స్పందించి.. స్టేషన్ లోని సిబ్బందిని ఆర్టీసీ బస్టాండ్ కు పంపించారు. పోలీసులు.. బస్టాండ్ లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. బైక్ మీద వెళుతున్న ఓ మహిళ వీడియోను చూసి.. ఆ బాలుడు మమ్మీ అంటూ గుర్తించాడని తెలిపారు. ఆ బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా.. విచారణ చేపట్టిన పోలీసులకు.. బైకు యజమాని నుంచి అతని స్నేహితుడు బైక్ తీసుకెళ్లినట్లు తేలిందట. అటువైపుగా విచారణ చేపట్టగా.. ఇంస్టాగ్రామ్ లో ఒక యువకుడు పరిచయమై.. భర్తను పిల్లాడిని వదిలేసి మహిళ వెళ్లేందుకు చేసిన ప్రయత్నమేనని పోలీసుల విచారణలో బయటపడింది.
Also Read:AP CM Chandrababu: సింగపూర్‌లా అమరావతిని చేస్తా..
అనంతరం.. మహిళను, ఆమె ఇన్ స్టాగ్రామ్ ప్రేమికుడిని.. ఆమె భర్తను పోలీస్ స్టేషన్ కి పిలిపించి.. కౌన్సిలింగ్ ఇచ్చి.. భర్తకు అంటే బాలుడు తండ్రికి పిల్లాడిని అప్పగించారు. నల్లగొండ టూ టౌన్ ఎస్సై సైదులు గౌడ్, పోలీసు సిబ్బంది చేసిన పనికి నల్గొండ ప్రజానీకం హర్షం వ్యక్తం చేశారు. కడుపున పుట్టిన బిడ్డను వదిలి నాకు ప్రియుడే కావాలని జంప్ అయిన తల్లి తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?