రియల్ స్టార్ ఉపేంద్ర సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం కన్నడలోనే కాదు తెలుగులోనూ ఉప్సీకి, ఆయన సినిమాలకు క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రయోగాలు చేయాలన్న, సినిమాలతో పొలిటికల్ సెటైర్స్ వేయాలన్న ఉపేంద్రకే చెల్లుతుంది. యుఐతో మరోసారి ఫ్రూవ్ చేశాడు ఈ శాండిల్ వుడ్ హీరో. ఈ మధ్య కాలంలో ఏడాదికి ఒకటి లేదా రెండు చిత్రాలతో సరిపెట్టేసిన ఉపేంద్ర ఇప్పుడు జోరు పెంచాడు. నాకు నేనే పోటీ నాతో నేనే పోటీ అంటూ వరుస మూవీస్ లైన్లో పెడుతున్నాడు.
Also Read : VD 12 : కింగ్డమ్ కథ.. ఇన్ సైడ్ టాక్ ఎలా ఉందంటే
లాస్ట్ ఐదేళ్లలో ఉపేంద్ర చేసిందీ నాలుగంటే నాలుగు సినిమాలు. అవన్నీ కూడా డిజాస్టర్సే. యుఐ ఓకే అనిపించినా కాసులు వర్షం కురిపించడంలో ఫెయిల్ అయ్యింది. అందుకే ప్రయోగాలకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లు కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పటి నుండి మరో లెక్క అంటూ ఫిక్సై శాండిల్ వుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను లైన్లో పెడుతున్నాడు. మొన్నే భార్గవను స్టార్ట్ చేసిన ఉపేంద్ర రీసెంట్లీ నెక్ట్స్ లెవల్ అనే చిత్రాన్ని ఎనౌన్స్ చేశాడు. తరుణ్ స్టూడియోపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు తరుణ్ శివప్ప. తుగ్లక్ ఫేం అరవింద్ కౌశిక్ దర్శకుడు. ఇవే కాకుండా మరో నాలుగు కన్నడ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే జస్ట్ ఫర్ ఛేంజ్ అన్నట్లుగా ఇతర ఇండస్ట్రీలపైనా ఫోకస్ చేస్తున్నాడు. రజనీకాంత్- లోకేశ్ కనగరాజ్ మల్టీస్టారర్ మూవీలో ఉప్పీ కీ రోల్ చేస్తుండగా.. ఇటు టాలీవుడ్‌లో ఆంధ్రా కింగ్ తాలూకాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. మూడేళ్ల తర్వాత టాలీవుడ్‌ను పలకరిస్తున్న ఉపేంద్ర.. కోలీవుడ్‌లో 17 ఏళ్ల తర్వాత టచ్‌లోకి వచ్చేస్తున్నాడు. మొత్తానికి యంగ్ హీరోల కన్నా జోరు చూపిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నాడు ఉప్పి.