AP CM Chandrababu: సింగపూర్ లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. తొలిరోజు భారత హై కమిషనర్ శిల్పక్ ఆంబులేతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలోనే మూడేళ్లలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి అని చెప్పుకొచ్చారు. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుపై చాలా మంది విమర్శలు గుప్పించారు. ఇక, తెలంగాణ అభివృద్ధికి నేను తెచ్చిన ఐటీ విప్లవమే కారణం అని గుర్తు చేశారు. హైటెక్ సిటీ ద్వారా ఐటీ రంగాన్ని ప్రోత్సహించాం.. ఐటీ రంగంలో తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ముందున్నారు అని పేర్కొన్నారు. సింగపూర్ ప్రజల ఉత్సాహం ఏపీ అభివృద్ధికి దోహదం కావాలి అని సీఎం చంద్రబాబు అన్నారు.
Read Also: Sandalwood : వరుసగా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్న సీనియర్ హీరో
అయితే, 2019లో ఏపీలో ప్రభుత్వం మారడంతో అమరావతి నిర్మాణం ఆగిపోయింది అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులకు ఇప్పటికి నేను చాలా బాధపడుతున్నాను.. అందుకోసమే రాష్ట్రాన్ని పున నిర్మాణం చేపట్టాను.. ఏపీని హెల్తీ, వెల్తీ, హ్యాపి సొసైటిగా మారుస్తామని హామీ ఇచ్చారు. కాగా, సింగపూర్లా అమరావతిని చేస్తానని 2014లో హామీ ఇచ్చాన్నారు. 2047 నాటికి యువత ఎక్కువగా ఉండే దేశం భారత్.. 2047 నాటికి భారతీయులు ప్రపంచంలో నెంబర్ వన్గా ఉంటారని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.