Tragedy: విషాదం.. చెరువులో మునిగి తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు మృతి
- రాజస్థాన్‌లో విషాదం
- కుటుంబ కలహాలతో చెరువులో మునిగి ఒక వివాహిత.. ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య
- మృతులు తల్లి లీల.. కూతుళ్లు కనిక.. కృష్ణగా గుర్తింపు
- భర్త తనను కొట్టి చిత్రహింసలకు గురిచేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. నాగౌర్ జిల్లా ఖిన్వ్సర్ ప్రాంతంలోని చరదా గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ వివాహిత, తన ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామ సమీపంలోని ఓ చెరువులో మునిగి సూసైడ్ కు పాల్పడ్డారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భవంద పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను వెలికితీసి ఖిన్వసర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకు తరలించారు. మృతులు తల్లి లీల, కూతుళ్లు కనిక, కృష్ణగా గుర్తించారు. అయితే.. తన కూతురు భర్త రోజు కొట్టి చిత్రహింసలకు గురిచేసే వాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Read Also: Pani puri: ‘పానీ పూరి’ శాంపిళ్లలో క్యాన్సర్ ఏజెంట్స్.. ప్రభుత్వం చర్యలు..
Also Read
- Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
- IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
కూతుళ్లతో కలిసి మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెనుక ఇంటి సమస్యలేనని తెలుస్తోంది. కాగా.. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్యకు ముందు లీల తన కుటుంబానికి అర్ధరాత్రి ఫోన్ చేసి ఇంట్లో గొడవ గురించి చెప్పిందని మృతురాలి పెద్ద నాన్న సుర్జారామ్ తెలిపారు. అయితే.. ఈ విషయం తెలుసుకుని కుటుంబ సమేతంగా ఉదయం చార్దా వెళ్లామని.. వెళ్లే సరికి గ్రామ చెరువులో లీల, ఆమె ఇద్దరు కూతుళ్ల మృతదేహాలు కనిపించాయని తెలిపాడు. లీలను తన భర్త కొట్టేవాడని.. ఈ కేసులో న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు.
Read Also: Aditya L1 Mission: ఇస్రో మరో చరిత్ర.. హాలో కక్ష్యను పూర్తి చేసిన ఆదిత్య-ఎల్1
తాజావార్తలు
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!