Monkey Viral Video: ‘మామ ఏక్ పెగ్ లా’ అంటూ.. బీరేసిన కోతి!
- నెట్టింట కోతులకు సంబంధించిన వీడియోలు
- ఆల్కహాల్ చుక్కలను గటగటా తాగేసింది
- అవాక్కవుతున్న జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monkey Beer Viral Video: ఇటీవలి కాలంలో కోతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మనుషులపై దాడులు చేయడం, తినుబండారాలను లాక్కోవడం, స్మార్ట్ ఫోన్‌లను ఎత్తుకెళ్లడం, మనుషులతో సరదాగా ఆడుకోవడంకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో రెండు కోతులు చేసిన విచిత్రమైన పని చూసి.. అందరూ అవాక్కవుతున్నారు. ఓ కోతి డస్ట్ బిన్ నుండి బీర్ బాటిల్‌ను తీసి.. అందులోని ఆల్కహాల్ చుక్కలను గటగటా తాగేసింది.
బ్రెజిల్‌లోని పరానా స్టేట్‌లోని ఒక పార్కులో రెండు కోతులు డస్ట్ బిన్‌పై కూర్చుకుని.. సరదాగా ఆడుకుంటున్నాయి. అందులో ఒక దానికి బిన్‌లో బీర్ బాటిల్ కనిపించగా.. దాన్ని బయటికి తీసింది. బిన్‌పై కూర్చుని ఎంచక్కా.. బాటిల్‌లోని మిగిలిన ఆల్కహాల్‌ను తాగేసింది. కోతి బీర్ తాగడంను గమనించిన ఓ వ్యక్తి తన మొబైల్లో వీడియో తీశాడు. దాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. కోతి బీరు తాగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మామ ఏక్ పెగ్ లా, ఈ కోతి రూటే సపరేటు గురూ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
Also Read: Viral Video: వీధిలో నడుస్తుండగా.. మహిళపై పడిన వాటర్ ట్యాంక్! అదృష్టం అంటే ఇదేమరి
ఇలాంటి ఘటనే ఒకటి గతంలో భారత్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలోని ఓ మద్యం దుకాణంలోకి కోతి ప్రవేశించి.. బీరు తాగుతూ కెమెరాకు చిక్కింది. బాటిల్‌లోని బీర్ మొత్తంను చుక్క కూడా వదలకుండా తాగేసింది. ఈ వీడియో అప్పట్లో హైలెట్ అయింది. అయితే కోతులు మానవ ఆహారం, పానీయాలు తీసుకోవడం వాటి ఆరోగ్యానికి హానికరం అని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. మద్యం లాంటి ఉత్పత్తులు పడేయొద్దని జనాలను అధికారులు కోరారు.
m macaco bêbado provou que somos mais parecidos do que pensávamos após beber uma cerveja que havia encontrado no lixo enquanto espectadores atônitos assistiam.
O vídeo, filmado no Paraná, mostra dois macacos-prego sentados em uma lata de lixo enquanto um deles bebe uma cerveja… pic.twitter.com/TRY3TSYLiW
— Gazeta Brasil (@SigaGazetaBR) October 10, 2024
తాజావార్తలు
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్‌ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!