హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. రీసెంట్ గా హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడుకు క్రేజ్ కూడా పెరిగిపోయింది.. ప్రస్తుతం ఈమె ‘శబరి’ సినిమాతో రాబోతుంది.. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు విడుదల పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి…
ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ఒక లెక్క, తాజాగా విడుదలైన సాంగ్ ఒక లెక్క.. సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది.. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల చేయబోతున్నారు.. తాజాగా ఈ సినిమా మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు.. అలిసిన ఊపిరికి ఖనఖన మండే గుండె ఆయుధంగా మారే అంటూ సాగే లిరికల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఈ సాంగ్ ను రెహమాన్ రాయగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు..
ఈ సినిమాను మే 3 న గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.. వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పటివరకు కీలక రోల్ లో మాత్రమే నటిస్తూ వస్తుంది.. ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తుంది.. యశోద, వీర సింహారెడ్డి,రీసెంట్ గా హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. అదే జోష్ లో ఇప్పుడు లీడ్ లో నటిస్తుంది.. శబరి సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతుంది.. ఈ సినిమా కథ కొత్తగా ఉందని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది.. ఇక సినిమా థియేటర్లలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..