ఒకప్పుడు సినిమాలు చేసి లైమ్‌లైట్‌లో ఉన్న సమయంలో ఏమీ మాట్లాడకుండా, ఇప్పుడు ఆయా సినిమాల గురించి మాట్లాడుతున్న నటీమణుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా నటి మోహిని అలాంటి వ్యాఖ్యలే చేసి సంచలనంగా మారింది. మోహిని బాలకృష్ణ ఆదిత్య 369, మోహన్ బాబు డిటెక్టివ్ నారద, చిరంజీవి హిట్లర్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తరువాత తమిళ సినీ పరిశ్రమలో సుమారు 100 సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. అయితే, చాలాకాలం నుంచి సినిమాలకు, సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఆమె ఇటీవల ఒక తమిళ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టింది.
Also Read: World Cup 2025: ప్రపంచకప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి.. అందరూ మహిళలే!
తమిళంలో కన్మణి అనే సినిమాలో ఒక సాంగ్ చేసింది. ఆ సాంగ్‌లో ఆమె బికినీలో కనిపించింది. ఈ సందర్భంగా దాని గురించి ఆమె మాట్లాడుతూ, ఆర్‌కే సెల్వమణి డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో తనకు నచ్చకపోయినా స్విమ్ సూట్ వేయించి షూట్ చేశారని చెప్పుకొచ్చింది. మాకు ఇష్టం లేకుండా ఆ సినిమాలో గ్లామర్‌గా కనిపించాల్సి వచ్చిందంటూ ఆమె సంచలన విషయాన్ని బయటపెట్టింది. మొత్తం మీద, ఇష్టం లేకపోయినా బికినీ ఎలా ధరించాలి అనే విషయం మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. బట్టలు ధరించాల్సింది మీరే కదా, మీకు నచ్చకపోతే సినిమా నుంచి తప్పుకుని ఉండాల్సింది. అప్పుడెప్పుడో చేసేసిన తప్పుకి ఇప్పుడు వేరే వాళ్లను బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు.