టాలీవుడ్ సీనియర్ నటుడు, ‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు ప్రస్తుతం సినిమాల్లో అడపాదడపా కనిపిస్తున్నా, ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజాగా ఆయన నటిస్తున్న ‘పారడైజ్’ (Paradise) అనే సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం మోహన్ బాబు అందుకున్న పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం, ‘పారడైజ్’ చిత్రం కోసం మోహన్ బాబుకు అక్షరాల రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో సినీ విశ్లేషకులు ఈ విషయంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మోహన్ బాబు సోలో హీరోగా సినిమా చేసినా ఇంత మొత్తం వస్తుందో లేదో తెలియదు కానీ, ఈ ప్రాజెక్ట్ కోసం మాత్రం ఆయనకు భారీగానే ముట్టజెప్పారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం మోహన్ బాబుకు ఉన్న ఇమేజ్ ఆయన డైలాగ్ డెలివరీకి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, అందుకే మేకర్స్ అంత భారీ పారితోషికం ఇచ్చి ఆయన్ని తీసుకున్నారని సమాచారం. ఈ సినిమాలో మోహన్ బాబు రోల్ ఎలా ఉండబోతోంది? ‘పారడైజ్’ ఏ రేంజ్ హిట్టవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి, చాలా కాలం తర్వాత మోహన్ బాబు రెమ్యూనరేషన్ మ్యాటర్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.