Mohammed Siraj takes superb catch to dismiss Jermaine Blackwood in IND vs WI 1st Test: ‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అని క్రికెట్‌లో ఓ సామెత ఉంటుంది. అది ఊరికే రాలేదు. ఎంత గొప్ప బౌలర్లు ఉన్నా, భీకర బ్యాటర్లు ఉన్నా.. సరైన ఫీల్డింగ్ లేకపోతే ఒక్కోసారి ఓటమి తప్పదు. క్రికెట్‌లో మ్యాచ్ గెలవాలంటే ‘ఫీల్డింగ్’ చాలా ముఖ్యం. సరైన ఫీల్డింగ్ ఉంటే.. ఓటమి అంచున ఉన్నా గెలిచే అవకాశాలు ఉంటాయి. అందుకే కష్టమైనా కూడా బౌలర్లు కూడా అప్పుడప్పుడు ఫీట్స్ చేస్తుంటారు. తాజాగా హైదరాబాద్ ప్లేయర్, టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ స్టన్నింగ్ క్యాచ్ ఒకటి అందుకున్నాడు. గాల్లో డైవింగ్ చేస్తూ.. ఒంటి చేత్తో అద్భుత క్యాచ్ అందుకున్నాడు.
బుధవారం మొదలైన తొలి టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఆదిలోనే కీలక వికెట్స్ కోల్పోయింది. త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (12), క్రైగ్ బ్రాత్‌వైట్ (20), రేమాన్ రీఫర్ (2)లు త్వరగా పెవిలియన్ చేరారు. ఈ సమయంలో జెర్మైన్ బ్లాక్‌వుడ్ విండీస్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే హైదరాబాదీ బౌలర్ మొహ్మద్ సిరాజ్ అద్భుతమైన క్యాచ్ అందుకుని అతడిని పెవిలియన్ చేర్చాడు.
విండీస్ ఇన్నింగ్స్‌లో 28వ ఓవర్ వేయడానికి జడేజా బౌలింగ్‌కు వచ్చాడు. ఆఖరి బంతికి జెర్మైన్ బ్లాక్‌వుడ్ భారీ షాట్ ఆడాడు. అయితే బ్యాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో.. బంతి గాల్లోకి లేచింది. మిడాఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న మొహ్మద్ సిరాజ్.. తన కుడివైపునకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. దాంతో బ్లాక్‌వుడ్ ఔట్ అయ్యాడు. అయితే క్యాచ్ అనంతరం మైదానంలో సిరాజ్ కాసేపు అలానే పడిపోయాడు. అతడి కుడి మోచేతికి గాయం అయినట్లు అనుకున్నా.. వెంటనే లేచి ఫీల్డింగ్ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన ఫాన్స్ సిరాజ్‌ను పొగిడేస్తున్నారు.
Also Read: R Ashwin Records: ఆర్ అశ్విన్ పాంచ్ పటాకా.. 4 రికార్డ్స్ బద్దలు! తొలి భారత బౌలర్‌గా
Also Read: WI vs IND: ఐదేసిన అశ్విన్.. తొలిరోజు భారత్‌దే ఆధిపత్యం! ఐపీఎల్ ఫామ్ కంటిన్యూ చేసిన యశస్వి
Have you ever expected this from Mohammed Siraj?
Blackwood went for the lofted shot against Jadeja's flight. And that was stupendously unbelievable from Siraj.#INDvsWI #WIvIND #WIvsIND #TeamIndia #MohammedSiraj #fancode #JioCinemapic.twitter.com/oUdeYfB4I8
— Sayantan Naskar (@Sayantan446) July 12, 2023