Mohammad Amir: ఛీ.. మీ వక్ర బుద్ది మారదా? భారత్ పై నోరుపారేసుకున్న పాకిస్తాన్ ప్లేయర్.!

Mohammad Amir

Mohammad Amir

Mohammad Amir: పాకిస్తాన్ ఆటగాళ్లకు వారి జట్టు సంగంతి పట్టించుకుంటారో లేదో కానీ.. అంతకంటే ఎక్కువగా భారత జట్టుపై విమర్శలు చేయడానికి రెడీ ఐపోతుంటారు. టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ఆటపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. “భారత్ సెమీఫైనల్‌కు చేరుకోదని” అమీర్ గతంలో చేసిన జోస్యం తప్పడంతో నెటిజన్లు అతడిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పాకిస్థానీ టీవీ షో ‘హార్నా మనా హై’ (Haarna Mana Hai) లో పాల్గొన్న అమీర్, భారత్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రూ. 4,000 డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఇయర్‌బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!

సూపర్ 8లో దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత భారత్ సెమీస్ చేరదని అమీర్ మాట్లాడిన సంగతి తెలిసిందే. కానీ జింబాబ్వే, వెస్టిండీస్‌లపై వరుస విజయాలతో భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. దీనిపై అమీర్ స్పందిస్తూ.. క్రికెట్ పరంగా చూస్తే భారత్ ఇంకా మంచి క్రికెట్ ఆడటం లేదని అన్నాడు. ముఖ్యంగా భారత్ ఫీల్డింగ్ ఏమాత్రం బాగోలేదని, మ్యాచ్‌ లో 3 క్యాచ్‌లు వదిలేయడమే కాకుండా ఫీల్డింగ్‌లో కూడా తడబడ్డారని పేర్కొన్నాడు. ఇంకా జస్ప్రీత్ బుమ్రా మినహా మిగిలిన బౌలర్లందరూ భారీగా పరుగులు ఇచ్చుకున్నారని విమర్శించాడు.

ఇంకా అమీర్ మాట్లాడుతూ.. పెద్ద జట్లపై హార్దిక్ పాండ్యా ఎప్పుడూ రాణించడని, విండీస్‌తో మ్యాచ్‌ లో 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చాడని అమీర్ అన్నాడు. ఇక మిస్టరీ స్పిన్నర్ గా పేరొందిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌ను వెస్టిండీస్ సమర్థవంతంగా ఎదుర్కొందని, సెమీఫైనల్ చేరిన జట్లు స్పిన్నర్లను బాగా ఆడగలవని.. అందుకే భారత్ ఇంకా ఈ టోర్నీలో భారత్ ఫేవరెట్ కాదని అభిప్రాయపడ్డాడు.

Shivam Dube The Finisher: శివమ్ దూబే.. ‘ది టీమిండియా ఫినిషర్’!

ఇక వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో షిమ్రాన్ హెట్ మేయర్ అవుట్ కావడంపై అమీర్ ఒక ‘కాంట్రవర్సీ’ని తెరపైకి తెచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో సంజూ శాంసన్ క్యాచ్ పట్టగా.. అంపైర్ అవుట్ ఇచ్చాడు. రివ్యూలో బంతి బ్యాట్‌కు తగిలినట్లు కనిపించినా హెట్ మేయర్ అసంతృప్తి చెందాడు. దీనిపై అమీర్ మాట్లాడుతూ.. “నా దృష్టిలో హెట్ మేయర్ అవుట్ కాదు. అది ఓ వివాదాస్పద నిర్ణయం. ఒకవేళ అతను మరికొంత సేపు క్రీజులో ఉండి ఉంటే వెస్టిండీస్ స్కోరు 220-230కి చేరి ఉంటే.. ఈ సమయానికి భారత్ టోర్నీ నుండి నిష్క్రమించేది” అని వ్యాఖ్యానించాడు. ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం జరగనున్న సెమీఫైనల్ పోరులో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి.