Modi Trump meeting: సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలుస్తారని ప్రచారం జరుగుతుంది. ద్వైపాక్షిక సంబంధాలలో భాగంగా ప్రధాని మోడీ – ట్రంప్ మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగే అవకాశం ఉందని పలు నివేదికలు వెలువడుతున్నాయి. ట్రంప్‌ను కలవడంతో పాటు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఇతర ప్రపంచ నాయకులతో కూడా ప్రధాని మోదీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ఓ జాతీయ మీడయా సంస్థ తన కథనంలో పేర్కొంది.
READ MORE: Hindu Temple Attack: మరో హిందూ ఆలయం ధ్వంసం.. ఏడాదిలో నాలుగో ఘటన!
ప్రధాని UNGAకి వెళతారా లేదా..
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిరంతరం కొనసాగిస్తున్న కారణంగా ఇండియాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 % సుంకాలు విధించారు. ఇప్పటికే విధించిన సుంకాల్లో 25% అమలు ఉంది. మిగిన 25 % సుంకాలు ఈనెల 27 నుంచి అమల్లోకి వస్తాయి. దీనిపై భారత్ స్పందించి.. వాషింగ్టన్ చర్యను “నిర్లక్ష్యంగా సుంకాలు విధించడం”గా కొట్టిపారేసింది. జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు ఇండియా తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఈక్రమంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి.
ఈ పరిణామాల వేళ అమెరికాకు ప్రధాని మోడీ వెళ్లనున్నట్లు కథనాలు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలుస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ పర్యటనలో ఇరుదేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యల పరిష్కారానికి ముందు అడుగు పడుతుందని సమాచారం. ఇదే పర్యటనలో భారత ప్రధాని పలువురు ఇతర దేశాధినేతలతోనూ సమావేశం కానున్నట్లు ప్రచారం జరుగుతుంది.
న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశం సెప్టెంబరులో జరగనుంది. దీనికి ప్రపంచదేశాల నాయకులు హాజరుకానున్నారు. ఈక్రమంలో భారతప్రధాని అమెరికా పర్యటన ఇంకా ఖరారు కాలేదని పలు జాతీయ మీడియా సంస్థ పేర్కొన్నాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని పాల్గొనడంపై ప్రభుత్వ వర్గాల నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
READ MORE: Saleem Pistol arrest: నేపాల్‌లో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్.. ఐఎస్ఐతో కనెక్షన్స్