PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ప్రసంగం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగే, ప్రధానమంత్రి ఏ అంశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. GST 2.0 సంస్కరణలు రేపు అమలు కానున్నాయి.
Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై స్పందించారు. పరోక్షంగా స్పందిస్తూ.. భారత వృద్ధికి భయపడే వారు అలాంటి చర్యలు తీసుకుంటారని అన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిరాశ నుంచి ఈ చర్యలు వచ్చాయని అన్నారు.
Modi Trump meeting: సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలుస్తారని ప్రచారం జరుగుతుంది. ద్వైపాక్షిక సంబంధాలలో భాగంగా ప్రధాని మోడీ – ట్రంప్ మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగే అవకాశం ఉందని పలు నివేదికలు వెలువడుతున్నాయి. ట్రంప్‌ను కలవడంతో పాటు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఇతర ప్రపంచ నాయకులతో కూడా ప్రధాని మోదీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ఓ…
Gold Prices: భారతదేశంలో ఆగస్టు 8న బంగారం ధరలు సరికొత్త గరిష్ఠాలకు చేరుకొని చరిత్ర సృష్టించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అక్టోబర్ ఫ్యూచర్స్ బంగారం 10 గ్రాములకు ₹ 1,02,250కి చేరుకుంది. ఇదే ఇప్పటివరకు అత్యధిక స్థాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం మెరుస్తోంది. COMEXలో డిసెంబర్ ఫ్యూచర్స్ ఔన్సుకు $3,534కి చేరుకుంది. ఇది ఏప్రిల్‌లో నమోదైన $3,544 రికార్డు ధరకు చాలా దగ్గరగా ఉంది. అసలు బంగారం ధరలు పెరగడానికి గల కారణాలు, ధరలు…
India On US Tarrifs: భారత ఉత్పత్తులపై అమెరికా 25 శాతం సుంకాలు విధించడం, రష్యా నుంచి భారత్ ముడిచమురును దిగుమతి చేసుకోవడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. అయితే, అమెరికా కామెంట్లపై భారత్ శుక్రవారం ఘాటుగానే స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం ఈ విషయం గురించి మాట్లాడారు. ‘‘మా ఇంధన అవసరాలను తీర్చడంలో, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల ద్వారా నిర్ణయం తీసుకుంటాము’’ అని…