ఢిల్లీలో పుతిన్ పర్యటన కొనసాగుతోంది. హైదరాబాద్ హౌస్‌లో పుతిన్-మోడీ ద్వైపాక్షిక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధం గురించి మోడీ ప్రస్తావించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం తటస్థంగా లేదని.. భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపే ఉంటుందని తేల్చి చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ శాంతి మార్గంలోకి రావాలని వస్తాయని ఆకాంక్షిస్తున్నట్లు మోడీ వ్యాఖ్యానించారు. అయినా ఈ కాలం యుద్ధం యుగం కాదని తెలిపారు.
శాంతి కోసం జరుగుతున్న చర్చల్లో భారత్ కూడా ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని నొక్కి చెప్పారు. భుజం నుంచి భుజం వరకు నిలబడతామని పేర్కొన్నారు. యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి నిరంతరం చర్చలో ఉన్నట్లు చెప్పారు. దేశాల సంక్షేమం శాంతి మార్గంలోనే ఉందని.. ఆ దిశగా ముందుకు సాగాలని పుతిన్‌ను మోడీ కోరారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో శాంతియుత పరిష్కారానికి మోడీకి పుతిన్ హామీ ఇచ్చారు.
గత నాలుగేళ్ల నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సాగుతోంది. అయితే ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శాంతి కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. తాజాగా ట్రంప్ బృందం.. పుతిన్‌తో చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలకు కూడా ఫలించలేదు. తాజాగా శాంతి వైపు మొగ్గు చూపాలని పుతిన్‌ను మోడీ కోరారు. దీంతో పుతిన్ హామీ ఇచ్చారు.