ఢిల్లీలో పుతిన్ పర్యటన కొనసాగుతోంది. హైదరాబాద్ హౌస్‌లో పుతిన్-మోడీ ద్వైపాక్షిక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధం గురించి మోడీ ప్రస్తావించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం తటస్థంగా లేదని.. భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపే ఉంటుందని తేల్చి చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ శాంతి మార్గంలోకి రావాలని వస్తాయని ఆకాంక్షిస్తున్నట్లు మోడీ వ్యాఖ్యానించారు. అయినా ఈ కాలం యుద్ధం యుగం కాదని తెలిపారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన భారత్‌లో కొనసాగుతోంది. ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం లభించింది. ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని పుతిన్ స్వీకరించారు. అక్కడ నుంచి రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ-అమెరికా అధ్యక్షుడు జో బైడన్ సమావేశంపై అధికారికంగా ప్రకటన చేసింది వైట్ హౌస్.. సెప్టెంబర్ 24న జో బైడెన్, నరేంద్రమోడీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుందని వెల్లడించింది.. కాగా, ప్రధాని మోడీ.. ఈ వారమే అమెరికా వెళ్లనున్నారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోడీ.. అమెరికా వెళ్లడం ఇదే మొదటిసారి.. గతంలో వర్చువల్ ద్వారా జరిగిన క్వాడ్ సమ్మిట్, క్లైమేట్ చేంజ్ సమ్మిట్, జీ-7 సమావేశాల్లో పాల్గొన్నారు.…