Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- ప్రధాని మోడీకి నెతన్యాహు ఫోన్
- ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- కీలక ప్రకటన విడుదల చేసిన పీఎంవో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురువారం ఫోన్ చేశారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరగడం ఆసక్తి రేపుతోంది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితులతో పాటు భారత్-ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమగ్రంగా చర్చించారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.
పీఎంఓ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. భారత్-ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కింద ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకార పురోగతిని మోడీ, నెతన్యాహు సమీక్షించారు. పరస్పర ప్రయోజనాల కోసం రక్షణ, సాంకేతికత, వ్యవసాయం, ఆవిష్కరణలు, వాణిజ్యం సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించారు.
Also Read
- West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
- Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Raksha Bandhan 2026: రక్షా బంధన్ 2026 ఎప్పుడు..? రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం.. గ్రహణం ప్రభావం ఉంటుందా?
- India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
అదే సమయంలో పశ్చిమాసియాలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రాంతీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తూ శాంతి, స్థిరత్వం కోసం పరస్పర సంప్రదింపులు కొనసాగించాలని వారు అభిప్రాయపడ్డారు. ఇకపై కూడా పరస్పరం నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని మోడీ, నెతన్యాహు అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
తాజావార్తలు
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!