నెల్లూరు నగరంలోని వుడ్ హౌస్ సంగంలో బిరదవోలు మహేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పెయింటింగ్ పనులు చేసుకుని జీవనం సాగించే మహేష్ కు మిత్రులతో విభేదాలు ఉన్నాయి. గత కొద్ది కాలంగా ఇరు వర్గాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వుడ్ హౌస్ సంఘం వద్ద మహేష్ మిత్రులతో మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన మహేష్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే. మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
Read Also:Bandi sanjay: ప్రీతి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు
ఈ సమాచారం తెలియడంతో నెల్లూరు నవాబ్ పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రత్యర్థులుగా ఉన్న వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా భావిస్తున్నారు. వేదాయపాలెంలోని కొందరు వ్యక్తులు ఈ హత్యలో పాలుపంచుకున్నట్లుగా తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది.
గుంటూరు దాచేపల్లిలో దారుణం
గుంటూరు దాచేపల్లిలో దారుణం జరిగింది. వ్యక్తిని గొడ్డలితో ముక్కలుగా నరికి హత్య చేసి మిర్చి తోటలో పూర్తిగా దగ్ధం చేశారు అగంతకులు. పల్నాడు జిల్లా , దాచేపల్లి పట్టణం మోడల్ స్కూల్ సమీపంలోని మిర్చి తోటలో ఘటన చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్టు అనుమానిస్తున్నారు స్థానికులు. పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also: TTD Temple Jubileehills Live: జూబ్లిహిల్స్ టీటీడీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు