Bandi sanjay: ప్రీతి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi sanjay: ప్రీతి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలను కోరారు. హన్మకొండలోని 54వ డివిజన్ లో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు బండి సంజయ్ హాజరయ్యారు. నిందితుడికి మద్దతుగా ధర్నా చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రీతి తల్లి, తండ్రులు ఎంత బాధపడి ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. లవ్ జీహాద్ వల్లే ఇలా అయిందని నేనంటే ఆమె తండ్రిని బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయన్న అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయకపోవడం వెనక రాజకీయ కోణం ఉందని అన్నారు.
వరంగల్ ను కేసిఆర్ లండన్ చేస్తానన్నారు ఏమైంది?
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
కేటీఆర్ సీఎం కావడాన్ని సాయన్న వ్యతిరేకించడం వల్లే ఆయనను అవమానించారని తెలిపారు. బట్టలూడదీసి బతుకమ్మలాడించిన నిరంకుశ నిజాంకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తే సాయన్నకు చేయకపోవడం బాధాకరమన్నారు. వరంగల్ నగరంలోని ఎమ్మెల్యేలు రాహు, కేతువులుగా మారి… భూ కబ్జాలకు చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ ను కేసిఆర్ లండన్ చేస్తానన్నారు ఏమైంది? అంటూ ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయ్..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలకు పైసల్లేవట… కానీ ఢిల్లీలో కేసీఆర్ కూతురు మద్యం స్కాంలో డబ్బులు పెట్టేందుకు డబ్బులు ఉన్నాయట అంటూ ఎద్దేవ చేశారు. అభివృద్ధిపై సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా..? ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామన్నారు. తెలంగాణలో సెంటిమెంట్ ను రగిలించి లబ్ది పొందాలని కేసీఆర్ చూస్తున్నారని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి జరుగుతుందని బండి సంజయ్ అన్నారు.
Read also: KFC Chicken: KFC సేఫ్ కాదా..? KFC చికెన్ తింటే క్యాన్సర్ వస్తుందా..?
కేంద్ర ప్రభుత్వం నిధులియ్యడం లేదు… అభివ్రుద్ధి చేయడం లేదని కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మిమ్ముల్ని కోరేదొక్కటే ఒక్కసారి వరంగల్ బస్టాండ్ కు వెళ్లి చూడండి అన్నారు. ఆ తరువాత వరంగల్ రైల్వే స్టేషన్ కు వెళ్లి చూడండి, ఎవరు అభివృద్ధి చేశారో మీరే బేరీజు వేయండని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీరియాడికల్ ఓవరాయిలింగ్ వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం కేంద్ర ప్రభుత్వం 430 కోట్లు మంజూరు చేసినం. టెండర్ ప్రాసెస్ అయ్యింది. ఇంకా ఎకరన్నం భూమి ఇయ్యాలే.. ఇంకా సాగదీస్తనే ఉన్నడు.. మళ్లా కేంద్రం ఇయ్యట్లేదని బదనాం చేస్తున్నాడని అన్నారు. సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కేంద్రం ఓకే చెప్పినా ఇంతవరకు ల్యాండ్ ఇవ్వలేదు.. సూపర్ స్పెషాలిటీ కట్టినా ప్రారంభోత్సవానికి నోచుకోలేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సక్రమంగా వాడుకోలేని దొంగ కేసీఆర్.. స్మార్ట్ సిటీ పేరుతో తొలుత రూ.500 కోట్లిస్తే… 192 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వమని మొత్తుకున్నా ఇయ్యకపోవడంతో మిగిలిన నిధులన్నీ వెనక్కు పోయినయ్ అని ప్రశ్నించారు. లెక్కలియ్యకపోవడంతో ఆ తరవాత రావాల్సిన నిధులన్నీ ఆగిపోయాయన్నారు.
కాకతీయ యూనివర్శిటీలో కనీస వసతుల్లేక విద్యార్థుల ఇబ్బందులు
ఉద్యమాల పురిటగడ్డ కాకతీయ యూనివర్శిటీ… కనీస వసతుల్లేక విద్యార్థులు అల్లాడుతున్నరు. 400 మంది స్టాఫ్ ఉండాల్సిన చోట 120 మందే ఉన్నారు. ఖాజీపేట బ్రిడ్జి నిర్మించడానికి కూడా కేసీఆర్ కు చేతగాలే అంటూ ఎద్దేవ చేశారు. చివరకు కేంద్రమే నేషన్ హైవే ప్రాజెక్టు కింద కేంద్రమే 12 కోట్లు మంజూరు చేసింది. 100 కోట్ల విలువగల హనుమాన్ దేవాలయ భూములను పరిరక్షించడానికి బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గత సంవత్సరంనర కాలం నుండి భూ ఖబ్జాదారుల నుండి పోరాటం చేస్తుందన్నారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. అధికారంలోకి వస్తే అర్హులందరికీ ఇండ్లు నిర్మిస్తామన్నారు. ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా కింద పరిహారం అందిస్తామన్నారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివ్రుద్ధి ఏమిటో దమ్ముంటే చర్చకు రా… ఎన్ని హామీలు చేసినవ్? తెలంగాణ రాకముందు ఆర్దిక పరిస్థితి ఏమిటి? తరువాత ఏమిటనే దానిపై చర్చకు రా… మేం సిద్ధమన్నారు. అభివ్రుద్ధిపై చర్చ జరగకుండా ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించే కుట్రకు కేసీఆర్ తెరదీసిండు.
Read also: Harish Rao: ప్రీతి కుటుంబ సభ్యులకు హరీశ్ పరామర్శ.. దోషులను శిక్షిస్తామని హామీ
రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు ఎక్కువైనయ్… శాంతి భద్రతలు అదుపు తప్పినయ్… ప్రీతి మెడికల్ విద్యార్థిని ర్యాగింగ్ పేరుతో మూర్ఖుడు పెట్టిన వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కొంతమంది పోలీసులు ర్యాగింగ్ చేసినోడి పక్షాన ఉంటూ ప్రీతికి అన్యాయం చేసే కుట్ర చేస్తున్నారు. లవ్ జిహాదీ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తుంటే… పోలీసులు ప్రీతి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి లవ్ జిహాదీ కాదని చెప్పించే యత్నం చేస్తున్నరు. ప్రీతి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటున్నా.. మొత్తం ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. హైదరాబాద్ లో కుక్కల దాడిలో పిల్లవాడు మరణిస్తే కుక్కలకు మటన్ దొరకకు దాడి చేశాయని మేయర్ చెబుతుండటం సిగ్గు చేటు. ఈ ఘటనపై కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గు చేటు.
Read also: Suryavamsam: పాతికేళ్ళ వెంకటేశ్ ‘సూర్యవంశం’!
ఎస్సీ వర్గానికి చెందిన సాయన్న 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజా సేవలో మరణిస్తే దళితుడనే కారణంతో అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించలేదు. కేటీఆర్ సీఎం కావాలంటూ జరిగిన సంతకాల సేకరణలో సాయన్న సంతకం పెట్టకపోవడంవల్లే ఆయన భౌతిక కాయానికి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించలేదన్నారు. నిజాం మనవడు ఈ దేశపోడు కాదు.. ఎక్కడో ఇస్తాంబుల్ లో చనిపోతే శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చి కేసీఆర్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం సిగ్గు చేటు. తెలంగాణ ఆడబిడ్డలను బట్టలిప్పి బతకమ్మ ఆడించిన నిజాం వారసుడికి అంత్యక్రియలు నిర్వహిస్తారా? దీనిపై సమాజం స్పందించాలన్నారు. బీఆర్ఎస్ ను తన్ని తరిమేయాలంటే బీజేపీతోనే సాధ్యం. రామరాజ్యం బీజేపీతోనే సాధ్యం. పేదవాడికి ఉన్నత అవకాశాలు బీజేపీతోనే సాధ్యం.
ఛాయ్ వాలా ప్రధానిని చేసిన ఘనత బీజేపీదే
ఛాయ్ వాలా ప్రధానిని చేసిన ఘనత బీజేపీదే. దళిత, ఆదివాసీ, మైనారిటీలను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదే అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో లిక్కర్ దందా చేసేటోళ్లు, పత్తాల దందా చేసేటోళ్లు, భూ దందా చేసేటోళ్లే మంత్రులవుతారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరూ ఆ పార్టీలో సీఎం కాలేరన్నారు. కేసీఆర్ కొడుకు పిరికిపింద… ఆయన పేరు తీయకుండా కోర్టు నుండి స్టే తెచ్చుకున్న చేతగానోడు నన్ను విమర్శిస్తున్నాడు. అమెరికాలో చిప్పలు కడిగినోడు… అయ్య పేరుతో పదవులు తెచ్చుకున్నోడు.. ఆయన అయ్య లేకుంటే కుక్కలు కూడా దేకవ్… దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం జైలుకు పోయిన. ప్రజల తరపున పోరాడి ఈ స్థాయికి వచ్చిన. నా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కింది. బీఆర్ఎస్ పార్టీని తరిమికొడదాం.. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి… రామరాజ్యాన్ని స్థాపించుకుందామని పిలుపు నిచ్చారు బండి సంజయ్.
Bhakthi Tv Stothraparayanam Live: శనివారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే..
తాజావార్తలు
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్‌తో ఆల్‌టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్‌ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్‌ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?