MM Keeravani: మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఈ ఈవెంట్‌కు చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.
READ ALSO: Asaduddin Owaisi: బీజేపీ కూటమి విజయంపై ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన కీరవాణి మాట్లాడుతూ.. గ్లోబ్ అంటే జస్ట్ అమెరికానే కాదని.. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయని అన్నారు. వాటిని ఈ సినిమా ద్వారా ఎన్నో కొన్ని మీ ముందుకు తీసుకురావడానికి పెద్ద ప్రయత్నం చేస్తున్న నిర్మాతలు, రాజమౌళికి ధైర్యానికి ప్రయత్నం ఈ సినిమా అని అన్నారు. ‘సూపర్ స్టార్ కృష్ణ అంటే నాకు చాలా అభిమానం. అలాగే ఆయన కొడుకు మహేష్ బాబు అంటే కూడా అంతే ఇష్టం. తన పవర్ ఫూల్ డైలాగ్స్ కోసం, నా మిత్రుడు మణిశర్మ పవర్‌పూల్ మ్యూజిక్ కోసం పోకిరి అనే సినిమాను ఎన్ని సార్లు చూశానో నాకే గుర్తు లేదు. వండర్ పూల్ మూవీ. మోస్ట్ ఫేవరేట్ మూవీ. అయితే కీరవాణి మెలోడీ బాగా కొడతాడు కానీ, బీట్ కొంచెం స్లోగా ఉంటుందనే పేరు ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. వాటీస్ దిస్.. అందుకే ఈ మధ్య నేను ఒక కొత్త ప్లాట్ కొన్నాను. ప్లాట్ అంటే హైదరాబాద్‌లోనే, వైజాగ్‌లోనే కాదు.. సిమెంట్‌తో చేసింది అసలే కాదు. మహేష్ బాబు ఫ్యాన్స్ అయిన అభిమానుల గుండెల్లో పర్మినెంట్‌గా ఉండటానికి ప్లాట్ కొన్నాను. టైల్స్ వేస్తున్నారు…. మోలోడీ నాదే.. ఫాస్ట్ బీట్ నాదే.. ‘ అంటూ పోకిరి డైలాగ్ ను చాలా పవర్ ఫుల్ టోన్ లో చెప్పి.. కీరవాణి అందరిని ఆశ్చర్యపరిచారు. 2027 సమ్మర్‌కు గృహ ప్రవేశం అని ఆయన చెప్పారు.
READ ALSO: Varanasi Movie: ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్..: మహేష్ బాబు