తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. కోదండరామ్ ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో తొలిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీవీ జిల్లా కోసం ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నారని, భూసంస్కరణలకు ఆద్యుడు పీవీ అని ఆయన కొనియాడారు. పీవీ జిల్లాపై ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు ఎమ్మెల్సీ కోదండరామ్. ప్రభుత్వంపై బీఆర్‌స్ అసహనం వ్యక్తం చేస్తోందన్నారు. పైసలతో ఏమైనా చేస్తాం అనే అహంభావం బీఆర్‌ఎస్ నాయకులలో ఉందన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి తో పనిచేస్తామని, బీఆర్‌ఎస్ ధోరణిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామిక పాలన అందజేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు ఎమ్మెల్సీ కోదండరామ్.
ఎమ్మెల్సీ గా నాకు కొత్త బాధ్యత అని, ఉద్యమ కారుడిగా నాకు గుర్తించారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రజా సంఘాలను చీల్చింది ఘర్షణ వాతావరణం నింపిందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తామన్నారు. తెలంగాణ జనసమితి ని కాంగ్రెస్ లో విలీనం చేయబోమని, కేంద్రoలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం సహకరిస్తామన్నారు. ఉద్యమకారుడిగా నాకు గుర్తింపు ఇచ్చింది కాంగ్రెస్ అని కొనియాడారు. బీఆర్ఎస్ సంఘాలను చీల్చింది.. ఘర్షణ వాతావరణం నెలకొల్పిందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తామన్నారు. జనసమితిని కాంగ్రెస్లో విలీనం చేయబోనని స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం సహకరిస్తానన్నారు.