ప్రొఫెసర్ కోదండరామ్..... పిల్లలకు రాజకీయ పాఠాలు చెప్పే సారు. క్లాస్‌రూమ్ లెసన్స్‌లో తనకు తిరుగులేదని అనింపించుకున్న ఈ మాస్టారు..... పొలిటికల్ ప్రాక్టికల్స్‌లో మాత్రం బాగా వెనుకబడ్డారన్న టాక్ నడుస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటుదామని రంగంలోకి దిగినా సరైన వ్యూహరచన లేక బోల్తా పడుతున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో.
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. కోదండరామ్ ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో తొలిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీవీ జిల్లా కోసం ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నారని, భూసంస్కరణలకు ఆద్యుడు పీవీ అని ఆయన కొనియాడారు. పీవీ జిల్లాపై ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు ఎమ్మెల్సీ కోదండరామ్. ప్రభుత్వంపై బీఆర్‌స్ అసహనం వ్యక్తం చేస్తోందన్నారు. పైసలతో ఏమైనా చేస్తాం…