NTV Telugu Site icon

MLC Kavitha : మహిళలను మోసం చేసిన సర్కార్ కాంగ్రెస్ పార్టీ

Kavitha

Kavitha

MLC Kavitha : మెదక్ చర్చిలో ఎమ్మెల్సీ కవిత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రార్థనలు చేశానని, క్రైస్తవ సోదరులకు బీఆర్‌ఎస్‌ పార్టీకి పేగు సంబంధం ఉందన్నారు కవిత. తెలంగాణ పోరాటంలో ప్రతి ఒక్క చర్చిలో ప్రార్థనలు జరిగాయని, మెదక్ జిల్లా కల సాకారం అయిందంటే కారణం కేసీఆర్ అని ఆమె వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు మెదక్‌కి వచ్చాయని, అమ్మగారి ఊరు కాబట్టి మెదక్ కి రావాలని ఉంటుందన్నారు కవిత. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గోదావరి జలాలతో సింగూరు నింపి మెదక్ జిల్లాకి నీళ్లు తెచ్చారని, కాళేశ్వరం పనులు మెదక్ జిల్లాలో సగంలోనే నిలిచిపోయాయన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్యాకేజీ 19 కింద జిల్లాలో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని, కేసీఆర్ పై కోపంతో పనులు ఆపేయడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. ప్రభుత్వాలు మారినా పనులు ఆపడం సరైనది కాదని ఆమె వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కాలువ పనులను అపొద్దని మేము కోరుతున్నామని, సీఎం జిల్లాకి వస్తున్నారంటే ఆడబిడ్డగా మాకేమైన వరాలు ఇస్తాడేమో అనుకున్నామన్నారు. నెలకు 2500, తులం బంగారం ఇస్తాడేమో అని మహిళలు అనుకున్నారు..కానీ ఏమీ లేదని ఆమె అన్నారు. పింఛన్ 4 వేలు ఇస్తామన్నారు.. ప్రతి 18 ఏళ్ల ఆడపిల్లకు స్కూటీ ఇస్తామన్నారు.. మహిళలను మోసం చేసిన సర్కార్ కాంగ్రెస్ పార్టీ అని కవిత ఆరోపించారు. కేసీఆర్ కిట్లు అడబిడ్డలకు ఇస్తలేరని ఆమె మండిపడ్డారు.

Santa Claus-Spider Man Fight: నడి రోడ్డుపై కొట్టుకున్న శాంతా క్లాజ్-స్పైడర్ మ్యాన్.. ఎవరు గెలిచారంటే?

అంతేకాకుండా..’కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 40 శాతం నేరాలు పెరిగాయి.. కిడ్నాప్ కేసులు ఎక్కువయ్యాయి.. మహిళల భద్రతపై సీఎంకి సోయి లేదు.. రైతులకు రైతు బంధు లేదు.. సంక్రాంతికి ఇస్తామన్న రైతు బంధు కచ్చితంగా ఇవ్వాలి.. చిన్న స్థాయి ఉద్యోగులకు రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. అన్ని రకాల వరికి బోనస్ ఇస్తామని సన్న వడ్లకే అని మాట మార్చారు.. మొక్కజొన్న, సొయా, పత్తి, మిర్చి, పసుపు, చెరుకు, జొన్న రైతులకు మద్దతు ధర ఇస్తామని చెప్పి ఇవ్వలేదు.. మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏమి చేయలేదు.. కొత్త ప్రభుత్వంపై ఏడాది వరకు విమర్శలు చేయొద్దని మా నాయకుడు కేసీఆర్ చెప్పారు.. అందుకే ఏడాది ఆగినం..ఏడాది అయ్యాక ప్రశ్నిస్తున్నాం.. రేషన్ కార్డుల ఊసే లేదు.. ఆనాడు మాటల కోటలు దాటి ఈ రోజు అన్ని కోతలే పెడుతున్నారు.. మెదక్ కి వచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి.. మహిళలకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి’ అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.

Venu Swamy : అల్లు అర్జున్ జాతకంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు..

Show comments