పుష్ప -2 సినిమాతో అల్లు అర్జున్ కు ఎంతటి క్రేజ్ వచ్చిందో ఆ సినిమా ప్రీమియర్ లో సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనతో అంతే వివాదంలో చిక్కుకున్నాడు అల్లు అర్జున్. వాస్తవాలేవైనా సరే ఈ కేసులో ఓక రాత్రి జైలు జీవితం కూడా గడిపాడు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ ను వరుస వివాదాలు చుట్టుముడుతుండడంతో ఆయన జాతకంపై కీలక వ్యాఖ్యలు చేసాడు ప్రముఖ జ్యోతిష్క పండితులు వేణుస్వామి.
Also Read : AlluAravind : శ్రీతేజ కుటుంబానికి రెండు కోట్లు ఆర్ధిక సాయం
వేణు స్వామి మాట్లాడుతూ ‘ జాతకాలను బట్టి అన్ని జరుగుతాయి. అల్లు అర్జున్ జాతకంలో అలా ఉంది కాబట్టి ఈ సంఘటన జరిగింది. వచ్చే ఏడాది మర్చి వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదు. కాస్త జాగ్రత్తగా ఉఁడాలి. ఎవరు కావాలని ఏది చెయ్యరు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు జరుగుతాయి. శ్రీ తేజ పైన వారి తండ్రి చెయ్యి వేయగానే అది చూసి కళ్ళ లోంచి నీళ్ళు వచ్చాయి. శ్రీ తేజ కోలుకుంటాడు అని నమ్మకం ఉంది. కచ్చితంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. శ్రీ తేజకు మృత్యుంజయ హోమం నా స్వంత ఖర్చులతో చేస్తాను. పాప కు రెండు లక్షల ఆర్థిక సాయం చేస్తున్నాను. నేను టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు ముహూర్తాలు పెట్టాను. కాబట్టి నేను సినిమా వాడినే. అందుకే శ్రీతేజ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నాను.వారం రోజుల్లో హోమం చేస్తాను. ఆ పిల్లాడికి ఏమి కాదు’ అని అన్నారు.